Happy Birthday Pawan Kalyan: ట్రెండ్ సెట్ చేసిన అసలైన పవర్ స్టార్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలు ఆయన అభిమానుల్లో ఒక తెలియని జోష్ కనిపిస్తుంది. ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ట్రెండ్ సెట్ చేసేది కొందరే. అలాంటి హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. కేవలం సినిమాలతోనే కాదు ఒక సామాజిక బాధ్యత ఉన్న పౌరుడిగా పవన్ నడిచే విధానం ఆయనకు మంచి క్రేజ్ ని అందించింది. ఇక నేడు పవన్ కళ్యాణ్ 49వ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు భారీ స్థాయిలో విషెస్ అందిస్తున్నారు.

సరికొత్త ట్రెండ్..

సరికొత్త ట్రెండ్..

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైమ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈవివి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ ఇన్నేళ్ళ కెరీర్ లో 25సినిమాలు మాత్రమే చేసినప్పటికీ ఆ సినిమాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు.

ఒక సాధారణ వ్యక్తిలా..

ఒక సాధారణ వ్యక్తిలా..

హీరోగా ఎంతగా గుర్తింపు తెచ్చుకున్న కూడా పవన్ ఒక సాధారణ మనిషిలా ఉండడానికి ఇష్టపడటం ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని మరింత పెంచింది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం పవన్ కళ్యాణ్ కి ముందు నుంచి అలవాటే. పవన్ చేసే సహాయల గురించి ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు.

జయాపజయాలతో సంబంధం లేకుండా..

జయాపజయాలతో సంబంధం లేకుండా..

అప్పట్లో బద్రి, తమ్ముడు, ఖుషి వంటి సినిమాలతో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ స్థాయి పెరుగుతూనే ఉంది కాని తగ్గడం లేదు. చాలా కాలం తరువాత గబ్బర్ సింగ్ హిట్టవ్వడంతో పవన్ కి ఉన్న బాక్సాఫీస్ పవర్ చూసి పక్క ఇండస్ట్రీలు కూడా ఆశ్చర్య పోయాయి.

మంచి మార్కెట్ ఉన్న సమయంలో..

మంచి మార్కెట్ ఉన్న సమయంలో..

ఇక హీరోగా మంచి మార్కెట్ ఏర్పరచుకున్న సమయంలో ఊహించని విధంగా పవన్ రాజకీయాల్లోకి రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. డబ్బుల కోసం కనీసం యాడ్స్ కూడా చేయని పవన్ హీరోగా మంచి ఆదాయం వస్తున్న సమయంలో జనసేన పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. ఓటమి చెందిన కూడా పవన్ లో పవర్ ఏ మాత్రం తగ్గలేదని ఆయన వేసే అడుగులను బట్టి అర్ధమవుతోంది.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
పవన్ అభిమానుల సెలబ్రేషన్స్

పవన్ అభిమానుల సెలబ్రేషన్స్

ప్రస్తుతం కరోనా పరిస్థితుల ప్రభావం వల్ల సెలబ్రేషన్స్ కి చాలా వరకు దూరంగా ఉన్న అభిమానులు పవన్ బర్త్ డే సందర్భంగా కరోనా పేషేంట్స్ కోసం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్స్ ఉచితంగా అందజేస్తున్నారు. ఈ విషయంపై పవన్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియాలో పవన్ పేరు సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X