Pawan Birthday Special: చిరు సినిమాకు ఫైట్ మాస్టర్‌గా పవన్: ఫ్లాప్ అయినా ఆ మూవీ ప్రత్యేకమే.!

By Manoj Kumar P

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.... తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఆయన... జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కేవలం హీరోగానే కాకుండా తనలోని ఎన్నో విద్యలను బయట పెట్టాడాయన. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఫైట్ మాస్టర్‌గానూ పని చేశాడు. పవన్ కల్యాణ్.. సెప్టెంబర్ 2 (బుధవారం) 49 పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్‌లోని ప్రత్యేకమైన విషయాల గురించి తెలుసుకుందాం.!

అసాధారణంగా వచ్చి ఆల్‌రౌండర్‌గా నిలిచి

అసాధారణంగా వచ్చి ఆల్‌రౌండర్‌గా నిలిచి

1996లో వచ్చిన ‘అక్కడ అమ్మాయి... ఇక్కడ అబ్బాయి' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మొదటి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించుకున్న అతడు.. ఆ తర్వాత ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేశాడు. ఇక, హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా, ఫైట్ మాస్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఇలా ఎన్నో రకాల టాలెంట్లతో ఆల్‌రౌండర్‌గా నిలిచాడు.

పవన్ కల్యాణ్‌ సినిమాకు నేషనల్ అవార్డు

పవన్ కల్యాణ్‌ సినిమాకు నేషనల్ అవార్డు

కెరీర్ ఆరంభంలోనే పవన్ కల్యాణ్‌కు మంచి పేరు తెచ్చి పెట్టిన మూవీ ‘తొలిప్రేమ'. కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫీచర్ ఫిల్మ్ తెలుగు జాబితాలో జాతీయ అవార్డును అందుకుంది. అంతేకాదు, పలు విభాగాల్లో ఈ మూవీకి ఏకంగా ఆరు నంది అవార్డులు కూడా దక్కాయి. వీటితో పాటు పవన్‌కు తొలి ఇండస్ట్రీ హిట్ కూడా ఈ మూవీతోనే వచ్చిన విషయం తెలిసిందే.

పాటలు మాత్రమే కాదు... డ్యాన్సర్‌గానూ

పాటలు మాత్రమే కాదు... డ్యాన్సర్‌గానూ

పవన్ కల్యాణ్ చాలా సినిమాలకు పాటలు పాడాడన్న విషయం అందరికీ తెలుసు. అయితే, ఆయన కొన్ని సినిమాలకు కొరియోగ్రాఫర్‌గానూ వర్క్ చేశాడన్నది కొంత మందికే తెలుసు. ‘ఖుషీ' మూవీలోని కొన్ని పాటలతో పాటు ‘జానీ', ‘గుడుంబా శంకర్' సినిమాల్లోని అన్ని పాటలకు పవర్ స్టారే కొరియోగ్రఫీ చేశాడు. అలాగే, ‘పంజా' టైటిల్ సాంగ్‌కూ డ్యాన్స్ కంపోజ్ చేశాడు.

ఫ్లాప్ అయినా ప్రత్యేకంగా నిలిచిన మూవీ.!

ఫ్లాప్ అయినా ప్రత్యేకంగా నిలిచిన మూవీ.!

అప్పటి వరకు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన పవన్ కల్యాణ్... తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని ‘జానీ' అనే సినిమాను తెరకెక్కించాడు. రేణు దేశాయ్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టినప్పటికీ... పవన్‌లోని దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టింది. మరోవైపు, ఈ మూవీకి ఆయన స్క్రీన్‌ప్లే రైటర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, ప్లేబ్యాక్ సింగర్‌గానూ పని చేశాడు.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
చిరంజీవి సినిమాకు ఫైట్ మాస్టర్‌గా పవన్

చిరంజీవి సినిమాకు ఫైట్ మాస్టర్‌గా పవన్

హీరోగా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పటికీ... తనలోని నైపుణ్యాలను బయట పెట్టేందుకు పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుండే వాడు. ఇందులో భాగంగానే చాలా సినిమాలకు ఫైట్ మాస్టర్‌గానూ పని చేశాడు. తన సినిమాలైన ‘బద్రీ', ‘తమ్ముడు', ‘ఖుషీ', ‘జానీ', ‘గుడుంబా శంకర్'కు ఫైట్స్ కంపోజ్ చేసుకున్న పవర్ స్టార్.. చిరంజీవి నటించిన ‘డాడీ' మూవీకీ స్టంట్స్ క్రియేట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X