For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హ్యాపీ బర్త్ డే డార్లింగ్ ప్రభాస్: బాహుబలితో హాలీవుడ్ రేంజ్.. సాహోతో బాక్సాఫీస్ స్టామినా

  |

  రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్‌లో ప్రవేశించిన ప్రభాస్ తనదైన శైలిలో రాణిస్తూ అందరి చేత డార్లింగ్ పేరును సొంతం చేసుకొన్నారు. విభిన్నమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో యంగ్ రెబల్ స్టార్ ట్యాగ్‌ను సొంతం చేసుకొన్నారు. బాహుబలితో జాతీయ స్థాయి నటుడిగా బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాడు. ఈ భారతీయ సినిమా బాహుబలి జన్మదినం అక్టోబర్ 23 తేదీ. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మీబీట్ బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ప్రభాస్ గురించి మరిన్ని విషయాలు మీకోసం..

  ఇంటర్నేషనల్ రేంజ్‌కు

  ఇంటర్నేషనల్ రేంజ్‌కు

  కటౌట్‌తోపాటు కంటెంట్‌కు మారుపేరు ప్రభాస్. ఈశ్వర్‌తో కెరీర్ ప్రారంభిం మిస్టర్ ఫర్‌ఫెక్ట్, చత్రపతి, మిర్చి లాంటి చిత్రాలతో బాక్సాఫీస్ హడలెత్తించారు. మాస్ పాత్రలే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ చేరువైన యంగ్ రెబల్ స్టార్ కెరీర్ బాహుబలితో అనుహ్యంగా మారిపోయింది. టాలీవుడ్, దక్షిణాది, భారతీయ సరిహద్దులను దాటేసి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాడు. ఇలా ఎదగడం వెనుక 17 ఏళ్ల నిరంతర శ్రమ, సినిమా పట్ల అంకితభావమే కారణంగా మారింది.

  దర్శకులకు ప్రయోగశాలగా

  దర్శకులకు ప్రయోగశాలగా

  ప్రభాస్‌లోని ప్రతిభను చూసిన దర్శకులు ఆయనను ఓ ప్రయోగశాలగా చేసుకొన్నారు. ఎమోషన్స్‌, హీరోయిజం ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించడం కత్తి మీద సామే. కానీ బాహుబలితో తనేంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. బాహుబలిపై నమ్మకంతో ఐదేళ్లపాటు మరో సినిమా చేయకుండా తన కమిట్‌మెంట్‌ను ప్రపంచానికి చాటాడు. దాంతో ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా ప్రభాస్ అవతరించారు.

  1000 కోట్ల మార్కెట్ రేంజ్

  1000 కోట్ల మార్కెట్ రేంజ్

  బాహుబలికి ముందు తెలుగు సినిమా పరిశ్రమ రేంజ్ 100, 150 కోట్లు. అలాంటిది తన సినిమాతో 1000 కోట్లకుపైగా దానిని పెంచాడు. దేశీయ సినిమాకు మార్గదర్శకంగా నిలిచిన బాలీవుడ్‌కు వసూళ్ల సునామీతో చుక్కలు చూపించాడు. ఆ తర్వాత సాహో కూడా అదే హిస్టరీని రిపీట్ చేసింది.

  బ్యాంకాక్ మ్యూజియంలో బాహుబలిగా

  బ్యాంకాక్ మ్యూజియంలో బాహుబలిగా

  బాహుబలితో అంతర్జాతీయ స్థాయిని అందుకొన్న ప్రభాస్‌కు ఓ అరుదైన గుర్తింపును సొంతం చేసుకొన్నారు. 2017లో బ్యాంకాక్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజికంలో మైనపు ప్రతిమను ప్రతిష్టించడం తెలుగు హీరోకు దక్కిన ఖ్యాతిగా మారింది. ఈ మ్యూజియంలో బాహుబలి రూపంలో పర్యాటకులకు ప్రభాస్ కనువిందు చేస్తున్నారు.

  సాహోతో మరోసారి మ్యాజిక్

  సాహోతో మరోసారి మ్యాజిక్

  బాహుబలి తర్వాత వచ్చిన సాహోతో మరోసారి దేశీయ బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టించారు. సినిమాకు ఫ్లాప్ టాక్ వినిపించిన దేశవ్యాప్తంగా సుమారు 450 కోట్ల వసూళ్లను సాధించాడు. కేవలం బాలీవుడ్‌లోనే రూ.160 కోట్ల షేర్‌ను సాధించడం ప్రభాస్ స్టామినాకు అద్దం పట్టింది. తొలిరోజునే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్లను సాధించడం ఓ రికార్డుగా పేర్కొంటున్నారు.

   పూజా హెగ్డేతో ప్రభాస్

  పూజా హెగ్డేతో ప్రభాస్

  బాహుబలి, సాహో తర్వాత ప్రస్తుతం ప్రభాస్ జిల్ చిత్ర దర్శకుడు రూపొందిస్తున్న ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానిక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

  English summary
  Young Rebel Star Prabhas celebrating his birthday on October 23. In this occasion, Telugu Filmibeat wishes happy birthday to Darling Prabhas.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X