Happy Birthday Prabhas: నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్.. ఆ సినిమా నుంచే యూ టర్న్
రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో బాక్సాఫీస్ రారాజుగా ఎదిగిన ప్రభాస్ నేడు 41వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇక కోట్లాది మంది ఆభిమానులు ఆయనకు తన బెస్ట్ బర్త్ డే విషెస్ ని అందిస్తున్నారు. సెలబ్రెటీలు కూడా ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు.
Recommended Video

వర్షం సినిమా నుంచి..
2002లో ఈశ్వర్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ మొదటి సినిమాతోనే అభిమానులకు బాగా దగ్గరయ్యాడు. ఫిట్నెస్ తోనే కాకుండా తన మంచి తనంతో అందరికి ఒక డార్లింగ్ అయ్యాడు. కెరీర్ మొదట్లో బాక్సాఫీస్ హిట్ కోసం ప్రభాస్ చాలానే కష్టపడ్డాడు. 2004లో వర్షం సినిమాతోనే ప్రభాస్ తన క్రేజ్ ని కొంచెం కొంచెంగా పెంచుకున్నాడు.

మధ్యలో అపజయాలు
ఇక రాజమౌళి దృష్టిలో పడిన తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఛత్రపతి సినిమా ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే మధ్యలో ప్రభాస్ కొన్ని అపజయలతో కూడా సతమతమవుతమయ్యారు. ఆ తరువాత బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో అన్ని రకాల ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. మిర్చితో అయితే బాక్సాఫీస్ డోస్ పెంచాడు.

ఒక ప్రాజెక్ట్ కోసం ఐదేళ్లు..
ఇక బాహుబలి ప్రాజెక్టుకు ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో 5 ఏళ్ల వరకు మరో పని పెట్టుకోలేదు. ఫైనల్ గా సినిమా పదిహేను వందల కోట్లు దాటడంతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక సాహో సినిమాతో బాలీవుడ్ ఆడియెన్స్ కి ప్రభాస్ మరింత దగ్గరయ్యాడు. అయితే ఆ సినిమా సౌత్ లో మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఏదేమైనా ప్రభాస్ రేంజ్ మాత్రం అస్సలు తగ్గలేదు.

భవిష్యత్తులో మరిన్ని బిగ్ బడ్జెట్ సినిమాలు
ఇక నెక్స్ట్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఇక రామాయణం కథ ఆధారంగా చేస్తున్న ఆదిపురుష్ బాహుబలి రేంజ్ లో తెరకెక్కనుంది. ప్రభాస్ రాముడు పాత్రలో నటించనున్న ఆ సినిమాకి ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అజయ్ దేవ్ గన్ కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











