For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Birthday Rhea Chakraborty: సుశాంత్ మరణం, డ్రగ్స్ కేసు.. పీకల్లోతు కష్టాల్లో రియా చక్రవర్తి బర్త్ డే..

  |

  కరోనావైరస్ ఓ వైపు దేశాన్ని అతలాకుతలం చేస్తుంటే.. దేశ మీడియాను పరుగులపెట్టించిన హీరోయిన్ రియా చక్రవర్తి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అత్యంత వివాదాస్పద వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అనేక ఆరోపణలు, జైలు జీవితం ఒక్కసారిగా ఆమెను టార్గెట్ చేశాయి. దాదాపు కెరీర్ పక్కన పెట్టి తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో అందరి ముందు దోషిలా నిలబడింది. ఇలాంటి పరిస్థితుల్లో రియా చక్రవర్తి జన్మదినం ఆమె ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి జీవితం గురించి..

  టాలీవుడ్‌లో సినీ కెరీర్‌

  టాలీవుడ్‌లో సినీ కెరీర్‌

  రియా చక్రవర్తి కెరీర్‌ టాలీవుడ్ చిత్రం తూనీగ తూనీగ సినిమాతో ప్రారంభమైంది. ఆ తర్వాత హిందీలో మేరే డాడ్ కీ మారుతీ, సొనాలీ కేబుల్, బ్యాంక్ చోర్, జలేబీ, చహ్రే లాంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆశించినంతగా ఆమె కెరీర్ ముందుకు సాగలేదు. 2012 నుంచి 2020 వరకు అంటే 8 ఏళ్లలో కేవలం ఎనిమిది సినిమాలే చేసింది. తెలుగులో కల్యాణ్ దేవ్ సినిమాలో ఆఫర్ లభించినా.. మధ్యలోనే ఆ సినిమాను వదిలేసి వెళ్లిపోయింది.

   సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో డేటింగ్

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో డేటింగ్

  బాలీవుడ్‌లో భారీ హిట్లతో యువ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో పరిచయం ప్రేమగా మారింది. యష్ రాజ్ ఫిలింస్ సెట్లో జరిగిన పరిచయం వారి మధ్య అఫైర్‌గా మారింది. 2019 సెప్టెంబర్ నుంచి ఇద్దరు కలిసి సహజీవనం చేశారు. ఆ తర్వాత రియా, సుశాంత్ కలిసి వివిడ్రేజ్ రియాలిటిక్స్ అనే కంపెనీని స్థాపించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 14 జూన్, 2020న ఆత్మహత్య చేసుకోవడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.

   అనూహ్యంగా జైలుపాలైన రియా చక్రవర్తి

  అనూహ్యంగా జైలుపాలైన రియా చక్రవర్తి

  సుశాంత్ సింగ్ మరణానికి ముందు అతడిని వదిలేసి వెళ్లడంతో అనేక అనుమానాలు రియా చక్రవర్తిపై పెరిగాయి. సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో రియా చక్రవర్తిపై కేసు నమోదు చేయడంతో ఆమెను ఈడీ, సీబీఐ, ఎన్సీబీ లాంటి దర్యాప్తు సంస్థలు విచారించేందుకు రంగంలోకి దిగాయి. బాలీవుడ్‌లో అనూహ్యంగా బయటకు వచ్చిన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నెల రోజులపాటు జైలు జీవితాన్ని అనుభవించింది. అనంతరం బెయిల్‌పై రిలీజ్ అయి ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు.

  మహేష్ భట్‌తో సన్నిహిత సంబంధాలు

  మహేష్ భట్‌తో సన్నిహిత సంబంధాలు

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత పలు వివాదాస్పద అంశాలు రియా చక్రవర్తిని చుట్టుముట్టాయి. దర్శకుడు మహేష్ భట్‌తో సన్నిహిత సంబంధాలు, ఇతర బాలీవుడ్ ప్రముఖులతో రిలేషన్స్ అన్నీ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. బెయిల్‌పై విడుదలైన రియా చక్రవర్తి తనపై పడిన అపవాదులు, వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే సుశాంత్ కుటుంబం డ్రగ్స్ తీసుకొంటుందని ఇటీవల ఆరోపణల చేయడంతో ఆమె సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్‌గా మారింది.

  మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా

  మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా

  రియా చక్రవర్తి వివాదాలతోను జీవితం కొనసాగిస్తున్న సమయంలో దేశంలోనే అత్యంత ప్రభావ శీల మహిళా ప్రముఖుల జాబితాలో ఆమె నంబర్ వన్ స్థానాన్ని అందుకొన్నది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన 50 మంది మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. రానున్న రోజుల్లో రియా చక్రవర్తి తన మీద పడిన మచ్చలను ఎలా సరిద్దిద్దుకొంటుందనే విషయం ఆసక్తిగా మారింది. అత్యంత వివాదాస్పద సెలబ్రిటీగా మారిన రియా చక్రవర్తి లైఫ్‌లో ఈ జన్మదినం ఎలాంటి మార్పును తెస్తుందో వేచి చూడాల్సిందే.

  English summary
  HBD Rhea Chakraborty: The actress started her career in Tollywood with Tuniga Tuniga movie. In 2019, Rhea falls in love with Actor Sushant Singh Rajput and dated together for quite sometime. She was elected as Most desirable women 2021 in India.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X