HBD Samantha: సమంతకు అన్ని కోట్ల ఆస్తులు.. ఇండియాలోనే తొలి హీరోయిన్‌గా రికార్డు.. విడాకులకు కారణం!

టాలీవుడ్‌లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చినా.. తనదైన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను హృదయాలను దోచుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు. అందరిలా కాకుండా తక్కువ సమయంలోనే క్రేజ్‌ను, మార్కెట్‌ను పెంచుకున్న ఈ భామ.. నాగ చైతన్యను పెళ్లాడి, విడాకులు తీసుకుని పర్సనల్‌గా ఇబ్బందులు పడింది. కానీ, కెరీర్ విషయంలో మాత్రం ఇప్పటికీ దూకుడుగానే ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సమంత ఈరోజు తన బర్త్‌డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె ఆస్తులు గురించి తెలుసుకుందాం పదండి!

మాయ చేసి స్టార్ హీరోయిన్‌గా:సమంత రూత్ ప్రభు 'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. తద్వారా ఎన్నో అవార్డులు దక్కాయి. టాలీవుడ్‌లో ఉన్న స్టార్లు అందరితోనూ సమంత సినిమాలు చేసింది. తద్వారా తన రేంజ్‌ను పెంచుకుంటూనే వచ్చింది. ఇలా దాదాపు పదేళ్లుగా ఈ అమ్మడు టాలీవుడ్‌లో హవాను చూపిస్తోంది.

Happy Birthday Samantha: Samantha Ruth Prabhu Net Worth and Remuneration

ఆ భాషల్లోనూ.. ఓటీటీ ఎంట్రీ:చాలా ఏళ్లుగా తెలుగులో తన హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న సమంత.. తమిళంలోనూ సత్తా చాటుతోంది. అక్కడ కూడా స్టార్ హీరోలందరితోనూ నటించే అవకాశాలను అందుకుంది. తద్వారా ఇప్పటికే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అలాగే, సమంత 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో పాటు 'పుష్ప' ఐటెం సాంగ్‌తో బాలీవుడ్‌లోనూ ఫేమస్ అయింది.

పంథాను మార్చి వాటిలోనూ:స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది 'యశోద' అనే చిత్రంతో వచ్చింది. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తోంది. ఇటీవలే సామ్.. గుణశేఖర్‌ తెరకెక్కించిన 'శాకుంతలం' మూవీలోనూ నటించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మాత్రం ఆశించిన రీతిలో రాణించలేక డిజాస్టర్‌గా మిగిలింది.

Happy Birthday Samantha: Samantha Ruth Prabhu Net Worth and Remuneration

ఇప్పుడా సినిమాలతో బిజీగా:ఆ మధ్య 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్లో నటించి.. బాలీవుడ్‌లోకి పరిచయం అయిన సమంత.. మళ్లీ అదే కాంబోలో 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. త్వరలోనే ఇది స్ట్రీమింగ్ కాబోతుంది. దీనితో పాటు ఇప్పుడు విజయ్ దేవరకొండతో 'ఖుషి' మూవీ చేస్తోంది. అలాగే, ఇళయదళపతి విజయ్‌తోనూ ఓ సినిమా, ఫిలిప్ జాన్ డైరెక్షన్‌లో ఓ ఇంగ్లీష్ ఫిల్మ్ చేస్తోంది.

Happy Birthday Samantha: Samantha Ruth Prabhu Net Worth and Remuneration

చైతూతో విడాకులు.. వ్యాధి:సమంత.. అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల పాటు అతడితో అన్యోన్యంగా గడిపిన సామ్.. రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకుంది. వీళ్లిద్దరి విడాకులకు అసలు కారణం ఏంటి అన్నది మిస్టరీగానే ఉండిపోయింది. ఇక, సమంత ఇప్పుడు మయోసైటిస్ అనే వ్యాధితో పోరాటం చేస్తోన్న విషయం తెలిసిందే.

సమంత నేషనల్ రికార్డుతో:సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత.. భారీ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇందులో తెలుగు హీరోలంతా ఆమె వెనకే ఉన్నారు. అంతేకాదు, ట్విట్టర్ ఇండియా ఆ మధ్య సమంత ఎమోజీని విడుదల చేసింది. తద్వారా ఈ ఘనతను అందుకున్న ఏకైక హీరోయిన్‌గా రికార్డు సాధించింది.

Happy Birthday Samantha: Samantha Ruth Prabhu Net Worth and Remuneration

సమంత ఆస్తుల వివరాలు:స్టార్ హీరోయిన్ సమంతకు ఓవరాల్‌గా రూ. 110 కోట్లు నికర విలువ ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు, ఆమె కార్లు అన్నీ కలిపి రూ. 10 కోట్లు ఉంటాయట. అలాగే, సమంత వాడే యాక్సిసిరీస్‌లు విలువ రూ. 5 కోట్లు పైనే ఉంటుందని తెలిసింది. వీటితో పాటు సమంతకు రూ. 50 కోట్లు విలువున్న చెన్నైలో ఒక ఇల్లు, ముంబైలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోనూ ఓ ఫ్లాట్ ఉన్నాయని సమాచారం.

Happy Birthday Samantha: Samantha Ruth Prabhu Net Worth and Remuneration

సంపాదనలో కూడా టాప్‌లో:ఏకధాటిగా సినిమాలు చేస్తోన్న సమంత.. రెండు చేతులా సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు రూ. 3 - 5 కోట్లు వసూలు చేస్తుందట. సౌత్‌లో నయనతార తర్వాత ఎక్కువ చార్జ్ చేసే హీరోయిన్ ఆమె అని అంటున్నారు. అలాగే, యాడ్స్‌కు, సోషల్ మీడియా పోస్టులకూ బాగానే చార్జ్ చేస్తోంది. ఫలితంగా ఆమె బ్రాండ్ వ్యాల్యూను భారీ స్థాయిలో పెంచుకుంటూ దూసుకెళ్తోంది.

భవిష్యత్‌లో కూడా సినిమాల్లో ఇలాగే రాణిస్తూ.. వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. సమంతకు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X