HBD Sreeleela: టీనేజ్‌లోనే తల్లైన శ్రీలీల.. తెలుగులో గొప్ప రికార్డు.. ఆమె గురించి ఈ నిజాలు తెలిస్తే!
గతంలో కంటే ఇప్పుడు సినీ రంగంలోకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వడం పెద్ద విషయం కాదు. కానీ, కొందరు అమ్మాయిలు మాత్రం ఆరంభంలోనే సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ శ్రీలీల ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ కుర్రది.. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో శ్రీలీల ఈరోజు తన బర్త్‌డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం పదండి!
కిస్ అంటూ వచ్చిన శ్రీలీల:శ్రీలీల అమెరికాలో జన్మించింది. ఆమె చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడిపోవడంతో మదర్‌తోనే కలిసి ఉంటోంది. టీనేజ్‌లో ఉన్నప్పుడు భరత నాట్యం నేర్చుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత డాక్టర్ అవ్వాలనుకుని మెడిసిన్ చదివింది. కానీ, ఊహించని విధంగా 2019లో వచ్చిన 'కిస్' అనే కన్నడ చిత్రంతో శ్రీలీల హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టేసింది.

తెలుగులోకి.. బిగ్ సక్సెస్:కన్నడంలో హీరోయిన్‌గా పరిచయమైన శ్రీలీల 2021లో వచ్చిన 'పెళ్లి సందD' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే ఈ అమ్మడు ఫుల్ పాపులర్ అయింది. దీని తర్వాత ఈ బ్యూటీ మళ్లీ కన్నడంలో పలు చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే రవితేజతో కలిసి 'ధమాకా' అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం శ్రీలీల కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
బాలయ్యతో... భారీగానే:శ్రీలీల ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా చేస్తున్న 'భగవంత్ కేసరి' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో నటసింహానికి ఆమె కూతురిగా చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే, మహేశ్ బాబు 'గుంటూరు కారం' మూవీలో సెకెండ్ లీడ్‌గా చేస్తుంది. అంతేకాదు, ఏకంగా పవన్ కల్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలోనూ శ్రీలీల నటిస్తూ దూసుకెళ్తోంది.

చిన్న హీరోలతో ఫుల్‌గా:ఇప్పటికే కొన్ని క్రేజీ బిగ్ ప్రాజెక్టులను చేస్తోన్న శ్రీలీల.. టాలీవుడ్‌లోని యంగ్ హీరోల సరసన కూడా నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అందులో పంజా వైష్ణవ్ తేజ్‌తో 'ఆదికేశవ', రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న ఓ మూవీ, విజయ్ దేవరకొండ 12వ సినిమాతో పాటు నితిన్ 32వ చిత్రంలోనూ భాగం అయింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులనూ చేస్తోంది.

బన్నీతో మాత్రం సస్పెన్స్:ఇప్పటికే చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న శ్రీలీల.. ఇప్పుడు ఆహాలో నిర్మాణం అవబోతున్న ఓ ప్రాజెక్టులోనూ భాగం అయింది. ఇందులో ఏకంగా అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. దీన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్నారు. అయితే, ఇది కవర్ సాంగా? టాక్ షోనా? వెబ్ సిరీసా? సినిమానా? అన్నది మాత్రం ఇప్పటి వరకూ స్పష్టం కాలేదు.

టాలీవుడ్‌లో గొప్ప రికార్డు:సాధారణంగా సినీ రంగంలో వరుసగా సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది శ్రీలీల ఏకంగా ఒకేసారి పది సినిమాల వరకూ చేస్తోంది. అందులో తెలుగులో 9, కన్నడంలో ఒక సినిమా ఉన్నాయి. వీటితో పాటు పలు యాడ్స్‌లోనూ నటిస్తోంది. గతంలో ఏ హీరోయిన్ కూడా ఏక కాలంలో ఇన్ని చిత్రాలు చేయలేదు. దీంతో శ్రీలీల గొప్ప రికార్డు సాధించింది.

టీనేజ్‌లోనే తల్లైన నటి:చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడిపోవడంతో ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకున్న శ్రీలీల.. ఓ అనాథాశ్రమంలో ఉన్న ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుంది. తద్వారా టీనేజ్‌లోనే వాళ్లకు తల్లిగా మారి బాగోగులు చూసుకుంటోంది. ఇది మాత్రమే కాదు.. జంతు ప్రేమికురాలిగా, సోషల్ వర్కర్‌గా, మెంటర్‌గా ఎంతో మందిని పలు సేవా కార్యక్రమాలు చేసేలా ప్రేరేపిస్తుంది.
ఇక, తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌గా మారిన శ్రీలీల.. కెరీర్ పరంగా మరింతగా దూసుకుపోవాలని కోరుకుంటూ.. ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.


Click it and Unblock the Notifications











