HBD Srinu Vaitla బ్లాక్ బస్టర్లకు కేరాఫ్ అడ్రస్.. వినోదానికి అడ్డగా శ్రీనువైట్ల!
టాలీవుడ్‌లో ఫన్, ఎమోషన్స్, యాక్షన్ దట్టించి ఇండస్ట్రీకి బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన దర్శకుల్లో శ్రీను వైట్ల ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. సక్సెస్ కోసం వెంపర్లాడుతున్న హీరోలకు స్టార్ స్టేటస్‌తోపాటు ఇండస్ట్రీ రికార్డు సినిమాలు అందించిన ఘనత శ్రీను వైట్ల సొంతం. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కోడైరెక్టర్‌గా తాను సాధించిన అనుభవంతో నీకోసం అనే సినిమాతో దర్శకుడిగా అవతారం ఎత్తారు. తొలి చిత్రంతోనే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనే ట్యాగ్ సంపాదించుకొన్నాడు.
నీకోసం సినిమా తర్వాత టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని ఇచ్చిన సలహాతో శ్రీను వైట్ల కెరీర్ గ్రాఫ్ అనూహ్యంగా మారిపోయింది. సీరియస్ కథకు కామెడీ జోడించాలనే ఆయన సూచన, సలహాతో వరుసగా బ్లాక్‌బస్టర్లను సొంతం చేసుకొన్నాడు. టాప్ డైరెక్టర్లలో ఒకడిగా శ్రీను వైట్ల మారిపోయారు.

ఆనందం సినిమాతో మొదలైన సక్సెస్ జర్నీ మంచువిష్ణుతో రెడీ, రామ్ పోతినేనితో రెడీ, చిరంజీవితో అందరివాడు, రవితేజతో దుబాయ్ శ్రీను, నాగార్జునతో కింగ్, వెంకటేష్‌తో దూకుడు, ఆగడు, ఎన్టీఆర్‌తో బాద్షా, రాంచరణ్‌తో బ్రూస్లీ లాంటి చిత్రాలతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పాపులారిటీ సంపాదించాడు. ఆగడు, బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంథోని సినిమాల ఫ్లాప్ కావడంతో రేసులో వెనుకపడ్డారు.
కొద్ది సంవత్సరాలుగా కెరీర్ పరంగా తడబాటుకు గురైన శ్రీను వైట్ల రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ తన సత్తాను చాటుకొనేందుకు సిద్దమవుతున్నారు. అగ్రహీరోతో విభిన్నమైన కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తనదైన ట్రీట్‌మెంట్, వినోదం, యాక్షన్‌తో హిట్టుకొట్టేందుకు సిద్దమవుతున్నారు. తెలుగు సినిమాకు కొత్త తరహా జోనర్‌ను పరిచయం చేసిన శ్రీనువైట్ల జన్మదినం సెప్టెంబర్ 24. ఆయన మళ్లీ పూర్వవైభవాన్ని సాధించాలని తెలుగు ఫిల్మీబీట్ ఆకాంక్షిస్తున్నది. హ్యాపీ బర్త్ డే శ్రీను వైట్ల.. లాంగ్ లివ్ విత్ గ్రేట్ సక్సెస్.


Click it and Unblock the Notifications











