Happy Birthday Thalaiva: బస్ కండక్టర్ నుంచి పొలిటీషియన్‌.. సూపర్ స్టార్‌కే సాధ్యమైన రికార్డులు

పేరుకు సౌతిండియన్ స్టారే అయినా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు సీనియర్ హీరో రజినీకాంత్. విభిన్నమైన శైలితో పాటు విలక్షణ నటనతో ఆకట్టుకున్న ఆయన.. ఎన్నో ఏళ్లుగా సినీ రంగంపై తన మార్క్ చూపిస్తున్నారు. ఒకవైపు కుర్ర హీరోలు దూసుకుపోతున్నా.. తన హవాను ఏమాత్రం తగ్గించకుండా సత్తా చాటుతున్నారాయన. వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న సూపర్ స్టార్... పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన డెబ్బైవ పడిలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ స్టోరీ మీకోసం!

 బస్ కండక్టర్ నుంచి కెరీర్ మార్చుకుని

బస్ కండక్టర్ నుంచి కెరీర్ మార్చుకుని

రజినీకాంత్ అలియాస్ శివాజీ రావ్ గైక్వాడ్.. బెంగళూరులో స్థిరపడిన ఒక మరాఠా కుటుంబంలో 1950 డిసెంబర్ 12న జన్మించారు. చిన్నప్పటి నుంచే నటనపై ఉన్న పిచ్చితో నాటకాల్లో వేషాలు వేసేవాడు. అదే సమయంలో బస్ కండక్టర్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలోనే మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ నోటిఫికేషన్ చూసి అందులో జాయిన్ అయ్యాడు రజినీకాంత్.

మొదటి అవకాశం ఇచ్చింది బాలచందర్

మొదటి అవకాశం ఇచ్చింది బాలచందర్

మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిన తర్వాత రజినీకాంత్‌కు మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే లెజెండరీ డైరెక్టర్ బాలచందర్.. ఆయనలోని నైపుణ్యాన్ని చూసి ‘అపూర్వ రాగంగళ్' అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయారు.

 అన్ని భాషల్లోనూ నటించి మెప్పించాడు

అన్ని భాషల్లోనూ నటించి మెప్పించాడు

తమిళంలో మాత్రమే కాదు.. దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతో పాటు హిందీలోనూ నటించారు రజనీకాంత్. తెలుగులో ‘టైగర్' అనే సినిమాలో ఎన్టీఆర్‌కు సోదరుడిగా చేసిన ఆయన.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో మెరిశారు. ఆ తర్వాత తన సినిమాలను మన భాషలోకి డబ్బింగ్ చేసి ఇక్కడా మంచి మార్కెట్ అందుకున్నారు. ఫలితంగా దేశం గర్వించే స్థాయికి ఎదిగారు.

 తలైవాకే సాధ్యమైన రికార్డులు బోలేడు

తలైవాకే సాధ్యమైన రికార్డులు బోలేడు

సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు, పురస్కారాలను సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇవి మాత్రమే కాదు.. జపాన్, మలేషియా వంటి దేశాల్లో ఫ్యాన్‌బేస్ కలిగిన ఇండియన్ హీరోగా రికార్డులకెక్కారు. అలాగే, ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే కొన్ని దేశాల్లో సెలవులు కూడా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అదీ సూపర్ స్టార్ రేంజ్‌ అంటే.

పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేసి

పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేసి

యాభై ఏళ్లుగా సినీ రంగంలో తనదైన ముద్రను వేసుకుని, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. తన పొలిటికల్ ఎంట్రీపై ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘జనవరిలో పార్టీ ప్రారంభం.. డిసెంబర్ 31న ప్రకటించబోతున్నాం' అని ఓ పోస్ట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X