Happy Birthday Varun Tej: ఆ ప్రత్యేకత ఉన్న ఏకైక తెలుగు హీరో.. చిన్నప్పుడే చిరంజీవితో సినిమా!

మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో వరుణ్ తేజ్. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కష్టపడుతూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను అందుకున్న అతడు మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌తో సాగిపోతోన్న వరుణ్ తేజ్ నేడు (జనవరి 19) పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మెగా ప్రిన్స్ గురించి స్పెషల్ స్టోరీ మీకోసం!

Recommended Video

Varun Tej Recovers And Tests Negative For COVID 19 | Filmibeat Telugu
అలా ఎంట్రీ.. రెండో దానితో నేషనల్ అవార్డ్

అలా ఎంట్రీ.. రెండో దానితో నేషనల్ అవార్డ్

శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన 'ముకుంద' అనే సినిమాతో తెలుగు చిత్ర సీమకు హీరోగా పరిచయం అయ్యాడు వరుణ్ తేజ్. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. కానీ, నటుడిగా అతడికి మంచి పేరును తెచ్చింది. అయితే, ఆ తర్వాత వచ్చిన 'కంచె'తో మొదటి విజయాన్ని అందుకున్నాడు వరుణ్. అంతేకాదు, ఈ మూవీకి జాతీయ అవార్డు కూడా దక్కింది.

Photos: Indian Celebs Amazing Transformation From Fat To Fit

ఎన్నో విజయాలు.... కెరీర్‌ను నిలబెట్టాయి

ఎన్నో విజయాలు.... కెరీర్‌ను నిలబెట్టాయి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్‌లో చేసింది కేవలం తొమ్మిది సినిమాలు మాత్రమే. వాటిలో చాలా వరకూ విజయాలే ఉన్నాయి. 'ముకుంద', 'లోఫర్', 'అంతరిక్షం' ప్రేక్షకుల మన్ననలు పొందినా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. అయితే, 'కంచె', 'ఫిదా', 'తొలిప్రేమ', 'ఎఫ్2', 'గద్దలకొండ గణేష్' వంటి సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. 'మిస్టర్' మాత్రం డిజాస్టర్ అయింది.

ప్రస్తుతం రెండు సినిమాలు.. విభిన్న కథలు

ప్రస్తుతం రెండు సినిమాలు.. విభిన్న కథలు

ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు సినిమాలను ప్రకటించాడు. అందులో 'ఎఫ్2'కు సీక్వెల్‌గా వస్తున్న 'ఎఫ్3' ఒకటి. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న 'గని'లోనూ వరుణ్ నటిస్తున్నాడు. దీన్నీ అల్లు బాబీ నిర్మిస్తున్నాడు.

ఆ ప్రత్యేకత ఉన్న ఏకైక తెలుగు హీరో తనే

ఆ ప్రత్యేకత ఉన్న ఏకైక తెలుగు హీరో తనే

మిగిలిన తెలుగు హీరోలతో పోలిస్తే వరుణ్ తేజ్ మాత్రమే సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తున్నాడు. చాలా మంది దీన్ని సరిగా ఫాలో అవకపోవడం వల్లే హీరోగా విఫలం అయ్యారు. అయితే, ఈ మెగా హీరో మాత్రం వైవిధ్యాన్ని చూపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను నడిపించుకుంటున్నాడు. ఈ కారణంగానే ఎన్నో విజయాలను అందుకున్నాడు. అలాగే మరింత ముందుకు సాగుతున్నాడు.

చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన సినిమా.. చిరు గెస్టుగా

చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన సినిమా.. చిరు గెస్టుగా

2000వ సంవత్సరంలో వచ్చిన 'హ్యాండ్సప్' అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేశాడు వరుణ్ తేజ్. నాగబాబు, బ్రహ్మానందం, జయసుధ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను శివ నాగేశ్వర్రావు తెరకెక్కించారు. నితిన్ కపూర్ నిర్మించిన ఈ సినిమాకు శశి ప్రీతమ్ సంగీతం అందించారు. ఇక, ఇందులో చిరంజీవి కూడా గెస్టుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, మూవీ మాత్రం అంతగా ఆడలేదు.

వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు కామెంట్స్

వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు కామెంట్స్

సినిమాల పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు వరుణ్ తేజ్. అలాగే, పర్సనల్‌ లైఫ్‌లోనూ ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇటీవలే తన సోదరి నిహారిక పెళ్లిని ఘనంగా జరిపించాడతను. ఇదిలా ఉండగా, కొద్ది రోజుల క్రితం వరుణ్ తేజ్ పెళ్లిపై తండ్రి నాగబాబు కామెంట్స్ చేశారు. 2021లో అతడి పెళ్లి చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే సంబంధాలు కూడా చూస్తున్నట్లు వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X