Happy Birthday Venkatesh: విక్టరీనే ఇంటి పేరు.. మహేశ్, పవన్.. ఈ అరుదైన రికార్డు వెంకీ సొంతం!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న హీరోల్లో తన ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకుపోతున్నాడు విక్టరీ వెంకటేష్. మూవీ మొఘల్ డీ రామానాయుడు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన.. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. ఈ క్రమంలోనే తెలుగులో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమాలు చేస్తూ పక్కింటి అబ్బాయిలా మారిపోయాడు. ఏజ్ బార్ అయిన తర్వాత తన వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఆదివారం (డిసెంబర్ 13) వెంకీ పుట్టినరోజు జరుపుకుంటోన్న సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం!

Recommended Video

HBD Victory Venkatesh : Narappa Glimpse లో వెంకీ అదుర్స్ | F3 Movie Announced
అద్దమే గురువు.. సినీ రంగ ప్రవేశం అలా

అద్దమే గురువు.. సినీ రంగ ప్రవేశం అలా


పేరుకు బడా నిర్మాత రామానాయుడు కుమారుడే అయినా.. తనలోని టాలెంట్‌ను నిరూపించుకోవాలన్న తాపత్రయంతో పాటు పడ్డాడు వెంకటేష్. ఇందులో భాగంగానే సినిమాల్లోకి వచ్చే ముందు అద్దాన్నే గురువుగా భావించి.. తనలోని నటనను మెరుగు పరుచుకున్నాడు. ఈ క్రమంలోనే 1986లో ‘కళియుగ పాండవులు' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు.

వరుస ఫ్లాప్‌లు.. సరైన ఫలితాలు రాబట్టి

వరుస ఫ్లాప్‌లు.. సరైన ఫలితాలు రాబట్టి

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘కళియుగ పాండవులు' సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే, ఆ తర్వాత వచ్చిన మూడు నాలుగు సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయలేదాయన. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ... సరైనా ఫలితాలను రాబట్టాడు. ఫలితంగా విక్టరీ అనే బిరుదును ఇంటి పేరులా మార్చుకున్నాడు.

వాళ్లకు కూడా చేరువ.. సొంత ఫ్యామిలీలా

వాళ్లకు కూడా చేరువ.. సొంత ఫ్యామిలీలా

కెరీర్ ఆరంభంలో ఎలివేషన్ ఉన్న సినిమాల్లో నటించిన వెంకటేష్.. క్రమక్రమంగా ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాడు. అదే సమయంలో క్లాసిక్ చిత్రాలనూ చేశాడు. ఫలితంగా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, కొన్ని కుటుంబ కథా చిత్రాల్లోనూ నటించి ఫ్యామిలీ హీరోగానూ పేరు సంపాదించుకున్నాడు. ఇవన్నీ వెంకటేష్‌ క్రేజ్‌ను బాగా పెంచేశాయని చెప్పొచ్చు.

34 ఏళ్లలో 74 చిత్రాలు.. ఎన్నో అవార్డులు

34 ఏళ్లలో 74 చిత్రాలు.. ఎన్నో అవార్డులు

విక్టరీ వెంకటేష్ సినిమాల్లో ప్రవేశించి 34 ఏళ్లు పూర్తయ్యాయి. సుదీర్ఘమైన కెరీర్‌లో ఆయన 74 చిత్రాల్లో హీరోగా నటించాడు. వీటిలో ఎక్కువ శాతం సూపర్ డూపర్ హిట్లే ఉన్నాయి. ఇలా ఏ హీరోకూ సక్సెస్ రేటు లేదనే చెప్పాలి. ఇక, ఆయన కెరీర్‌లో 7 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డ్స్, 5 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకోవడంతో పాటు ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు వెంకీ.

టాలీవుడ్‌లో ఈ అరుదైన రికార్డు సొంతం!

టాలీవుడ్‌లో ఈ అరుదైన రికార్డు సొంతం!


టాలీవుడ్‌లో మల్టీస్టారర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకటేష్. ఆయన ఇటీవలి కాలంలోనే మహేష్‌తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', పవన్‌‌తో కలిసి ‘గోపాల గోపాల', రామ్‌తో ‘మసాలా', వరుణ్‌ తేజ్‌తో ‘F2', నాగ చైతన్యతో ‘వెంకీ మామ' అనే సినిమాల్లో నటించారు. తన పాత్ర పరిధి తక్కువుందా..? ప్రాధాన్యత ఉందా..? అనేవి పట్టించుకోకుండా సినిమాలు చేయడం ఆయన ప్రత్యేకత.

తమిళ చిత్రం రీమేక్‌లో నారప్పగా వెంకీ

తమిళ చిత్రం రీమేక్‌లో నారప్పగా వెంకీ


ప్రస్తుతం వెంకటేష్ ‘నారప్ప' అనే సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో సూపర్ స్టార్ ధనుష్ నటించిన చిత్రం ‘అసురన్'కు ఇది రీమేక్. దీన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. దీనికి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X