HBD Venkatesh: వెంకటేష్ గురువు ఎవరో తెలుసా? అన్ని వేల కోట్లకు అధిపతి.. ఏ హీరోకూ దక్కని రికార్డు ఇది!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తనదైన చిత్రాలను చేస్తోన్న ఆయన.. ఇప్పటికీ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటున్నాడు. ఈ మధ్య కాలంలో అయితే ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతోన్నాడు. ముఖ్యంగా ఏజ్‌కు తగ్గట్లుగానే కథలను ఎంపిక చేసుకుంటూ అభిమానులను మెప్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 13) వెంకటేష్ పుట్టినరోజు జరుపుకుంటోన్నారు. ఈ సందర్భంగా ఆయన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించిన అంశాలు మీకోసం!

వెంకటేష్ గురువు ఎవరంటే:బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా ప్రపంచానికి పరిచయం అయిన వెంకటేష్.. ఆసక్తి లేకపోయినా తండ్రి కోరిక మేరకు సినిమాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం ఆయన అద్దాన్నే గురువుగా భావించి.. తనలోని నటనా నైపుణ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే 1986లో 'కళియుగ పాండవులు' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Happy Birthday Venkatesh: Daggubati Venkatesh Records, Assets, Remuneration and Net Worth Details

ఇంటి పేరుగా మారిన విక్టరీ:'కళియుగ పాండవులు' వంటి హిట్ తర్వాత వెంకటేష్ చేసిన నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా వరుసగా సినిమాలు చేశాడు. తద్వారా సరైనా ఫలితాలను అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుని విక్టరీనే ఇంటి పేరులా మార్చుకున్నాడు. అలా టాలీవుడ్‌లో వెంకటేష్ స్టార్‌గా ఎదిగిపోయాడు.

ఆ వర్గానికి మరింత దగ్గరగా:ఆరంభంలో అన్ని జోనర్లలో సినిమాలు చేసిన వెంకటేష్.. తర్వాత ప్రయోగాత్మక చిత్రాలతో వచ్చాడు. అదే సమయంలో క్లాసిక్ చిత్రాలనూ చేశాడు. ఫలితంగా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, కొన్ని కుటుంబ కథా చిత్రాల్లోనూ నటించి ఫ్యామిలీ హీరోగానూ పేరు తెచ్చుకున్నాడు. ఇవన్నీ వెంకటేష్‌ రేంజ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ వెళ్లాయి.

Happy Birthday Venkatesh: Daggubati Venkatesh Records, Assets, Remuneration and Net Worth Details

ఏ హీరోకూ దక్కని విధంగా:విక్టరీ వెంకటేష్ సినిమాల్లో ప్రవేశించి చాలా కాలం అయింది. సుదీర్ఘమైన కెరీర్‌లో ఆయన ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించాడు. వీటిలో ఎక్కువ శాతం సూపర్ డూపర్ హిట్లే ఉన్నాయి. ఇలా ఏ హీరోకూ సక్సెస్ రేటు లేదనే చెప్పాలి. ఇక, ఆయన కెరీర్‌లో 7 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డ్స్, 5 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుని ఎన్నో రికార్డులు కూడా ఖాతాలో వేసుకున్నాడు.

Happy Birthday Venkatesh: Daggubati Venkatesh Records, Assets, Remuneration and Net Worth Details

టాలీవుడ్‌లోనే తొలి హీరోగా:వెంకటేష్ టాలీవుడ్‌లో మల్టీస్టారర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే మహేష్‌తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', పవన్‌‌తో 'గోపాల గోపాల', రామ్‌తో 'మసాలా', వరుణ్‌ తేజ్‌తో 'F2' అండ్ 'F3', నాగ చైతన్యతో 'వెంకీ మామ' చిత్రాల్లో నటించారు. ఇలా మరో స్టార్ హీరో చేయని విధంగా మల్టీస్టారర్ చిత్రాలు చేసిన హీరోగా నిలిచాడు.

వెంకీ ఆస్తుల విలువ అంతా:టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌కు ప్రస్తుతం దాదాపు రూ. 1000 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులతో కలిపితే మరో ఐదు వందల కోట్లు ఉంటాయట. వీటితో పాటు ఇళ్లు, కార్లు, ఫ్లాట్లు ఇలా మొత్తం మీద ఆయనకు రూ. 2200 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిసింది. అలాగే, రామానాయుడు స్టూడియోలలో కూడా సగం వాటా ఉందట.

Happy Birthday Venkatesh: Daggubati Venkatesh Records, Assets, Remuneration and Net Worth Details

రెమ్యూనరేషన్.. సైంధవ్‌గా:తన కెరీర్‌లో ఎక్కువ శాతం వెంకటేష్ సొంత బ్యానర్‌లోనే సినిమాలు చేయడంతో లాభాల్లో వాటాలు తీసుకునేవాడట. ఇక, వేరే చిత్రాలకు మాత్రం రెమ్యూనరేషన్ కానీ, పంపిణీ హక్కులు కానీ తీసుకుంటున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ఒక్కో సినిమాకు వెంకీ రూ. 8 -10 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వెంకీ 'సైంధవ్' అనే మూవీతో రాబోతున్న విషయం తెలిసిందే.

సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తోన్న విక్టరీ వెంకటేష్ మరిన్ని పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ.. వెంకీ మామకు తెలుగు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X