Happy birthday Venu Udugula: విరాటపర్వంతో బాక్సాఫీస్ హిట్టుపై కన్నేసిన సెన్సేషనల్ డైరెక్టర్
నేటితరం దర్శకులు డిఫరెంట్ కథలు ఎంచుకుంటే గాని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం లేదు. ఇక తన మొదటి సినిమాతో విబిన్న దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న వేణు ఉడుగుల కూడా ఇండస్ట్రీలో ఒక స్పెషల్ క్రేజ్ అందుకుంటున్నాడు. మనోడు చేసిన మొదటి సినిమా 'నీదీ నాదీ ఒకే కథ' విమర్శకుల ప్రశంసలను అందుకున్న విషయం తెలిసిందే. ఇక నేడు ఈ విలక్షణ దర్శకుడి పుట్టినరోజు కావడంతో అతని మేకింగ్ ని మెచ్చే ఆడియెన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ళ నుంచి కొనసాగుతున్న వేణు కొన్ని సినిమాలకు రైటర్ గా కూడా పని చేశాడు. ఇక నీదీ నాదీ ఒకే కథ సినిమా సక్సెస్ అనంతరం ఇండస్ట్రీలోకి ఒక కొత్త తరహా దర్శకుడు వచ్చాడని మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. నెక్స్ట్ విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి వంటి టాలెంటెడ్ యాక్టర్స్ నటిస్తున్న ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చూస్తుంటే హిట్టు కొట్టేలా ఉన్నాడనిపిస్తోంది.

కేవలం సినిమాలనే కాకుండా వెబ్ సిరీస్ లను కూడా రూపొందించడానికి ఈ దర్శకుడు అల్లు అరవింద్ వంటి అగ్ర నిర్మాతలతో చేతులు కలిపాడు. సహా నిర్మాతగా వ్యవహరిస్తూ చలం నవల ఆధారంగా ఒక వెబ్ కంటెంట్ ని ప్లాన్ చేస్తున్నాడు. అతి తక్కువ కాలంలోనే మంచి దర్శకుడిగా క్రేజ్ అందుకుంటున్న వేణు ఉడుగుల ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











