Happy Father's Day: తండ్రికి తగ్గ వారసులుగా రాబోయే టాలీవుడ్ హీరోలు.. అందరి ఫోకస్ వారిపైనే!

ఫాదర్స్ డే సందర్భంగా నేడు చాలా మంది సినీ ప్రముఖులు వారే తండ్రులతో కలిసి ఉన్న కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అయితే అభిమానులు కూడా వారి అభిమాన హీరోల వారసులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తండ్రికి తగ్గ వారసులుగా రాబోయేది విరే అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్రహీరోల నుంచే నెక్స్ట్ జనరేషన్ లో రాబోయే హీరోలపై ఒక సైట్ ఎక్కువగానే ఉంది ఇక వారిపై మనం కూడా ఒక లుక్కేస్తే..

టాలీవుడ్ నట వారసత్వం

టాలీవుడ్ నట వారసత్వం


టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత జనరేషన్ నుంచి వచ్చిన నందమూరి అక్కినేని వారసులు ఏ స్థాయిలో సక్సెస్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి వారసుల నుంచి వచ్చిన బాలకృష్ణ ఎన్టీఆర్ అగ్ర హీరోలయ్యారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున నాగచైతన్య అఖిల్, ఘట్టమనేని, మెగా ఫ్యామిలీ నుంచి కూడా అందరూ వారికంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నారు.

నందమూరి బాలయ్య వారసుడు

నందమూరి బాలయ్య వారసుడు


ఇక ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న అగ్రహీరోల కొడుకుల కోసం అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. ఇక నందమూరి బాలకృష్ణ వారసుడు ఎప్పుడు వస్తాడా అని ఆ వర్గం అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తేజ ఇదివరకే ఆదిత్య369 కి సీక్వెల్ తో ఎంట్రీ ఇస్తాడు అని బాలయ్య బాబు వివరణ ఇచ్చాడు. కానీ ఇంతవరకు సరైన క్లారిటీ లేదు. కానీ ఫైనల్ గా ఎప్పటికైనా అతను ఎంట్రీ ఇస్తాడు అని నందమూరి అభిమానుల్లో చర్చ సాగుతోంది.

జూనియర్ పవర్ స్టార్

జూనియర్ పవర్ స్టార్


ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆయన పెద్ద కుమారుడు అకిరా నందన్ తండ్రి తగ్గట్టుగానే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడు అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 18 ఏళ్ల వయసు కి రావడంతో అతను సినిమా హీరో గా రావాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అకిరా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అతను మ్యూజిక్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. ఇక ఫ్యూచర్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి.

ఘట్టమనేని వారసుడు పక్కా..

ఘట్టమనేని వారసుడు పక్కా..

మహేష్ బాబు ఘట్టమనేని అభిమానులు కూడా ఆయన వారసుడు గౌతమ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తండ్రికి తగ్గట్లుగానే మహేష్ బాబు రాణించగా ఆ తర్వాత గౌతమ్ కూడా మంచి క్రేజ్ అందుకునే అవకాశం అయితే ఉంది. ఇది వరకు అతను వన్ నేనొక్కడినే సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబు గా కనిపించిన విషయం తెలిసిందే. ఇక తప్పకుండా గౌతమ్ అయితే భవిష్యత్తులో హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని మహేష్ కూడా నమ్మకం వ్యక్తం చేశారు.

 వెంకటేష్ వారసుడు

వెంకటేష్ వారసుడు

ఇక రాబోయే రోజుల్లో వెంకటేష్ కొడుకు కూడా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టే అవకాశం అయితే ఉంది. అతను ఇంకా టీనేజ్ వయసులో కూడా దాటలేదు. అర్జున్ దగ్గుపాటి ఫోటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అయితే అతని ఫోకస్ మొత్తం స్టడీస్ పైనే ఉంది. వెంకటేష్ ఎప్పుడూ కూడా అతన్ని సినిమాల్లోకి రావాలని కూడా కోరలేదు కానీ భవిష్యత్తుల్9 మాత్రం అతను కూడా ఎంట్రీ ఇస్తాడు అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X