సుశాంత్ అలా ఎడిపిస్తే.. ధోని ఇలా ఎడిపించాడు.. 2020 మరీ ఇంత దారుణమా?

టీ20 క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానులకు ఒక స్పెషల్ కిక్. క్రికెట్ స్థాయిని ఆటగాళ్లకున్న క్రేజ్ ని మరో లెవెల్ కి తీసుకు వెళ్లిన 20 20 అనేది మొన్నటివరకు అందరికి ఒక ఫేవరేట్. కానీ ప్రస్తుతం 2020వ సంవత్సరంలో జరుగుతున్న ఘటనలను చూస్తుంటే ఆ నెంబర్ అంటేనే చిరాకు వస్తోందని అంటున్నారు చాలా మంది జనాలు. ఓ వైవు కరోనా మరోవైపు సినీ తారల మరణాలు ఇలా ఊహించని ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి.

Recommended Video

Sushant Singh Rajput, MS Dhoni's Hard Core Fans Shares Their Special Moments || Oneindia Telugu
ధోని నిర్ణయానికి అందరూ షాక్..

ధోని నిర్ణయానికి అందరూ షాక్..

ఇక ఇటీవల మహీంద్ర సింగ్ ధోని క్రికెట్ కి గుడ్ బై చెప్పడం ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది. ఇండియన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆ వార్తను ఏ మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. అయితే ధోని ఇలాంటి సమయంలో ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే సుశాంత్ ఘటనతో పోలుస్తూ మరింత భావోద్వేగానికి లోనవుతున్నారు. సుశాంత్, ధోని బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన క్లిప్స్ అండ్ ఫొటోస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

సుశాంత్ అలా ఎడిపిస్తే.. ధోని ఇలా..

సుశాంత్ అలా ఎడిపిస్తే.. ధోని ఇలా..


రెండు నెలల క్రితం మరణించిన సుశాంత్ ఘటనను జనాలు ఇంకా మారచిపోలేదు. అతను ఏకంగా ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయి ఎడిపిస్తే.. ధోని తన ఆటకు రిటైర్మెంట్ ఇచ్చి అభిమానుల ఊహలకు, జోరుకు తుది వీడ్కోలు పెడుతూ మరింత బాధకు గురి చేశారు. దీంతో 2020 అనే దానిపై నెటిజన్స్ ఊహించని విధంగా స్పందిస్తున్నారు.

 ధోని బయోపిక్ ద్వారా యూ టర్న్

ధోని బయోపిక్ ద్వారా యూ టర్న్

2016లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోని బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అతనికి ఒక యూ టర్న్ అనే చెప్పాలి. అయితే అదే సినిమాతో సుశాంత్ సౌత్ ఆడియెన్స్ కి కూడా మరింత దగ్గరయ్యాడు. తెలుగు, తమిళ్ లో కూడా విడుదలైన ఆ సినిమా మంచి కలెక్షన్స్ ని అందుకుంది. ఆ సినిమాతోనే సుశాంత్ స్థాయి పెరిగింది. అద్భుతమైన నటనతో ఈ హీరో తెరపై ధోనిని గుర్తుకు తెచ్చాడు.

ధోనీతో సుశాంత్..

ధోనీతో సుశాంత్..

ధోనీకి, సుశాంత్ కి కూడా మంచి స్నేహం ఉంది. బయోపిక్ కోసం సుశాంత్ ఆరు నెలలకు పైగా ధోనితో ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో తన ఫ్యామిలీకి కూడా బాగా దగ్గరయ్యాడు సుశాంత్. ధోని కూతురితో సుశాంత్ ఆడుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఇక సడన్ గా ఒకరు ప్రపంచాన్ని వదిలివెళ్లిపోతే మరొకరు క్రికెట్ కి గుడ్ బై చెప్పేయడం పెద్ద షాక్ అనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X