పడక గది అనుకొన్నావా? గ్రౌండ్‌లోనే ప్రియురాలితో హార్థిక పాండే సరసాలు.. నెటిజన్ల ఫైర్
ప్రపంచ టీ20 క్రికెట్ కప్ టోర్నమెంట్‌లో భారత జట్టు విజయం సాధించడం దేశ ప్రజలందరికీ ఎనలేని సంతోషానికి గురి చేసింది. దేశవ్యాప్తంగా ఊరు, వాడల్లో మొదలుకొని అన్ని ప్రాంతాల్లొ సంబురాలు జరుపుకొన్నారు. ఈ గెలుపును ఆస్వాదిస్తూ యువత ర్యాలీలు తీశారు. రంగుల్లో మునిగి తేలుతూ మరోసారి హోళీ ఉత్సవాలను తలపింపచేశారు. అయితే ఈ విజయాన్ని అందించిన క్రికెటర్లు కూడా తమ జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యులు, గర్ల్‌ఫ్రెండ్, ప్రియురాళ్లతో తమ ఆనందాన్ని షేర్ చేసుకొన్నారు. అయితే విజయాన్ని ఆస్వాదించే క్రమంలో క్రికెటర్ హార్తిక్ పాండ్యా చేసిన అత్యుత్సాహం మితీమీరడంతో నెటిజన్లు సభ్యత నేర్చుకో అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. హార్థిక్‌పై నెటిజన్ల ట్రోలింగ్ విషయానికి వస్తే..
న్యూజిలాండ్ జట్టుపై భారీ విజయాన్ని సాధించడంతో భారతీయ క్రికెటర్ల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. కివిస్ జట్టు ఆలౌట్ కాగానే మైదానంలో చిన్న పిల్లల్లా గెంతులు వేశారు. ఒకరినొకరు కౌగిలించుకొంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ కప్ వీరులను అభిమానులు కీర్తించారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు గ్రౌండ్‌లోకి వచ్చి క్రికెటర్ల ఆనందంలో భాగమయ్యారు.

ఇషాన్ కిషన్ తన ప్రియురాలితో, సూర్య కుమార్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో, హర్థిక్ పాండే తన గర్ల్‌ఫ్రెండ్‌తో గ్రౌండ్‌లో చెట్టాపట్టాలు వేసుకొని గెలుపును ఆస్వాదించారు. లక్షలాది మంది అభిమానులు చూస్తుండగానే ముద్దుల్లో మునిగిపోయారు. కౌగిలింతలతో క్రికెటర్లు కేక పెట్టించారు. ఈ ఆనందంలో తాము ఎక్కడ ఉన్నాం? ఏం చేస్తున్నామనే విషయాన్ని మరిచిపోయి విజయం మత్తులో తూలి ఆడారు.
అయితే ఇతర క్రికెటర్లతో పోల్చుకొంటే హర్థిక్ పాండే మాత్రం ఓ డోస్ రొమాన్స్‌ను బహిరంగంగానే ప్రదర్శించాడు. తన ప్రియురాలి మహిక శర్మతో మాత్రం ఓ రేంజ్‌లో కెమిస్ట్రీని పండించారు. గెలిచిన వెంటనే తన ప్రియురాలిని వెతుక్కొంటూ వెళ్లి గాలి కూడా చొరబాటుకు వీలు లేకుండా తన కౌగిలిలో బంధించాడు. ఆమె కూడా ఆయన ప్రేమలో మునిగి తన్మయత్వంలో తేలిపోయింది.
అయితే ఓ దశలో వారి రొమాన్స్ ఆహ్మాదాబాద్ మైదానంలో మితిమీరిపోయింది. పురస్కారాలు అందించే స్టేజ్‌పై ఇద్దరు పడుకొని తమ ప్రేమను వ్యక్తం చేసుకొన్నారు. ఈ వ్యవహారంపై అందరి దృష్టిని ఆకర్షించింది. హార్థిక్, మహికా లిప్‌లాక్ కూడా వైరల్ అయింది. ఈ ఘటనపై, వారి ప్రవర్తపై నేటిజన్లు ఘాటుగా స్పందించారు.
హర్థిక్ పాండే, మహికా.. ఏంటీ ఈ చెండాలం. ఏం జరుగుతున్నదో.. ఏం చేస్తున్నారో మీకు కొంతైనా స్పృహ ఉందా? హర్థిక్ బ్రో.. మీరు ఏం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మీ బిహేవియర్ ఏంటి యార్.. అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఇంకొందరైతే గ్రౌండ్ ఏమైనా పడకగది అనుకొన్నారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా హద్దులో ఉండి ఏం చేసినా అందరికి ఆమోదమే.. కాస్త శృతిమించితేనే భరించడం కష్టంగా ఉంటుందని హర్థిక్, మహికా ప్రూవ్ చేశారు.


Click it and Unblock the Notifications











