For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’కు ఐదేళ్లు.. హరీష్ శంకర్ ట్వీట్స్ వైరల్

    |

    సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమా అటు దర్శకుడిగా హరీష్ శంకర్‌కు, ఇటు హీరోగా సాయి ధరమ్ తేజ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. సాయి ధరమ్ తేజ్ మంచి ఊపులో ఉన్న సమయంలో సరైన సినిమా పడింది. సినిమా విడుదలై నేటికి ఐదేళ్లు అవుతున్న సందర్భంగా హరీష్ శంకర్ ఎమోషనల్ అయ్యాడు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా తలుచుకున్నాడు.ఈ మేరకు హరీష్ శంకర్ వరుసగా ట్వీట్లు చేస్తూ వచ్చాడు.

    నా మనసుకి నచ్చిన సినిమా.... నా మనుషుల పై నమ్మకం పెంచిన సినిమా.......... అంటూ నిర్మాత దిల్ రాజుకు థ్యాంక్స్ చెప్పాడు. శిరీష్, హర్షిత్ రెడ్డి అందించిన ప్రేమకు ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపాడు. సినిమాటోగ్రఫర్ రాం ప్రసాద్, సంగీతం అందించిన మిక్కీ జే మేయర్, ఎడిటర్ గౌతం రాజుకు, సెట్స్ వేసిన రామకృష్ణ దంపతులకు, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, వెంకట్‌లు థ్యాంక్స్ తెలిపాడు.

    Harish Shankar About 5 Years Of Subramanyam For Sale

    లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. మా సుప్రీమ్ హీరో, నా స్టార్ బ్రదర్‌తో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది.. ఆయన చూపించే ప్రేమ, అంకితభావం, సినిమా అంటే ప్యాషన్ వేరే లెవెల్.. మరీ ముఖ్యంగా గువ్వా గోరింక సాంగ్ కోసం చాలా కష్టపడ్డారు.

    Harish Shankar About 5 Years Of Subramanyam For Sale

    థ్యాంక్స్ తమ్ముడు అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ ట్వీట్‌కు సాయి ధరమ్ తేజ్ రిప్లై ఇస్తూ.. నన్ను నమ్మి సుబ్రహ్మణ్యం పాత్రను ఇచ్చినందుకు థ్యాంక్స్.. నటుడిగా మరో మెట్టు ఎక్కించావ్.. సుబ్రహ్యణం ఫర్ సేల్‌కు ముందు తరువాత అనేలా నాలో మార్పును తెచ్చావ్ అంటూ సాయి ధరమ్ తేజ్ రిప్లై ఇచ్చాడు.

    English summary
    Harish Shankar About 5 Years Of Subramanyam For Sale, Am thankful to my CINEMATIGRAPHER Ramprasad and MickeyJMeyer for his wonderful tunes and fantastic background score indebted to my EDITOR Sri Gowtham Raju gaaru ,& the art duo Mr& Mrs Ramakrishna Folded.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X