twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : ఇస్తరాకు ఎంగిలాకు అంటూ సెటైర్స్.. హరీష్ శంకర్ బండ్ల గణేష్ కోల్డ్ వార్

    |

    గత రెండు మూడ్రోజులుగా బండ్ల గణేష్, హరీష్ శంకర్ వ్యవహారం ముదిరిపోతోంది. ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుంటున్నారు. తనకోపమే తనకు శత్రువని ఒకరంటే.. ఇస్తరాకు ఎంగిలాకు, మనసు, సత్యం, హృదయం అంటూ మరొకరు పరోక్ష కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ వారిద్దరి మధ్య ఏం జరిగింది? వివాదాం ఎందుకు మొదలైంది? అనే విషయాలను ఓ సారి చూద్దాం.

    పోర్న్ స్టార్‌తో ఆర్జీవీ రచ్చ రచ్చ.. జీఎస్టీని మించేలా 'క్లైమాక్స్'.. నగ్నంగా మరోసారి!!పోర్న్ స్టార్‌తో ఆర్జీవీ రచ్చ రచ్చ.. జీఎస్టీని మించేలా 'క్లైమాక్స్'.. నగ్నంగా మరోసారి!!

    గబ్బర్ సింగ్‌పై ట్వీట్..

    గబ్బర్ సింగ్‌పై ట్వీట్..

    గబ్బర్ సింగ్ వచ్చి ఎనిమిదేళ్లైన సందర్భంగా హరీష్ శంకర్ ఓ ట్వీటేశాడు. ఇప్పటికీ ఈ చిత్రంపై ప్రేమను కురిపిస్తున్నందుకు థ్యాంక్స్ అని చెబుతూ.. గబ్బర్ సింగ్‌కు పని చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని చెప్పాడు. అందులో నిర్మాత అయిన బండ్ల గణేష్ పేరును ప్రస్థావించలేదు.

    అక్కడే వివాదం మొదలు..

    అక్కడే వివాదం మొదలు..

    ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గబ్బర్ సింగ్ విషయంలో తన పేరును ప్రస్థావించకపోవడంపై బండ్ల గణేష్ హర్ట్ అయినట్టు తెలుస్తోంది. అదే హరీష్ శంకర్ సంస్కారమని, ఫ్లాపుల్లో, డిప్రెషన్‌లో ఉన్న హరీష్ శంకర్‌కు తానే అవకాశం ఇచ్చానని, రీమేక్‌లు తప్పా ఇంకేమీ చేయలేడని ఘాటు వ్యాఖ్యలే చేశాడు.

    మళ్లీ హరీష్ శంకర్ ట్వీట్..

    మళ్లీ హరీష్ శంకర్ ట్వీట్..

    అయితే మరో ట్వీట్‌లో హరీష్ శంకర్.. బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా వివరించాడు. అయితే దాంతో పాటో మరో ట్వీట్ చేశాడు. ఓ సూక్తిని పోస్ట్ చేశాడు హరీష్. కోపం అంటే ఏంటి? కోపం అంటే శత్రువు.. అది ఎదుటి వారిని నాశనం చేసే లోపే.. మనల్ని నాశనం చేస్తుందని ఓ కొటేషన్‌ను పోస్ట్ చేశాడు. ఇక పరోక్షంగా బండ్లను ఉద్దేశించిందేనని నెటిజన్స్ భావించారు.

     మనకోసం తీయాలి..

    మనకోసం తీయాలి..

    రీమేక్స్ తప్పా సరైన హిట్ సినిమా లేదని కామెంట్ చేయడంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. అన్నా ఓ హిట్ సినిమా తీసి నిరూపించు అని తెలిపాడు. అయితే సినిమాలనేవి ఒకరి కోసం, నిరూపించుకోవడం కోసం కాదు.. మన సంతృప్తి కోసం తీయాలని రిప్లై ఇచ్చాడు.

    Recommended Video

    #Tollywood : This Famous Director Lost A Chance To Direct The Pawan Kalyan Movie | Filmibeat Telugu
    ఇస్తరాకు ఎంగిలాకు..

    ఇస్తరాకు ఎంగిలాకు..

    మనస్సు మాట వినడానికి ఎంతో ధైర్యం కావాలి ఎందుకంటే.. మనస్సు ఎప్పుడూ నిజాలే చెబుతుంది కనుక అని ఓ పోస్ట్ చేశాడు. తింటున్నంత సేపు ఇస్తారాకు అంటారు తిన్నాక ఎంగిలాకు అంటారు.. నీతో అవసరం ఉన్నంతసేపు వరుసలు కలిపి మాట్లాడుతారు.. అవసరం తీరాక లేని మాటలు అంట కడతారు'అని మరో పోస్ట్ చేశాడు. ఇవన్నీ హరీష్ శంకర్‌ను ఉద్దేశించే అని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇలా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ చాలా సీరియస్ గానే నడుస్తున్నట్టు కనిపిస్తోంది.

    English summary
    Harish Shankar And Bandla Ganesh Cold War. On The Occassion Of * Yaers Of Gabbar Singh, Harish Didn't Talk ABout Producer Bandla Ganesh. So That Bandla Ganesh Throws Satire On Director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X