twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీ నోట్లో చక్కెర పొయ్య..ఆ దర్శకుడు అన్న మాటతో గాల్లో తేలిపోయిన హరిష్ శంకర్

    |

    హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. తన అభిమానాన్ని ప్రేమని మొత్తంగా గబ్బర్ సింగ్ రూపంలో చూపించాడు. ఆ సినిమాతో హరీష్ శంకర్ మెగా ఫ్యాన్స్‌కు చాలా దగ్గరయ్యాడు. అది ఓ దర్శకుడిలా తీయలేదని, ఓ హీరోను తమ అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో అని ఓ ఫ్యాన్‌గానే ఆ చిత్రాన్ని తీశానని హరీష్ శంకర్ చెబుతుంటాడు. అలా అని హరీష్ శంకర్ కేవలం పవన్ కళ్యాణ్‌తో సినిమాలు తీస్తానని పట్టుబట్టి కూర్చోలేదు.

    మధ్యలో మహేష్ బాబును మెప్పించేందుకు ట్రై చేశాడు. సరైన కథ తీసుకొస్తే తాను కూడా వింటానని హరీష్ శంకర్‌కు ఛాన్స్ ఇచ్చాడు చిరంజీవి. ఇలా హరీష్ శంకర్ ప్రయత్నాలు కూడా చాలాపెద్ద లెవెల్‌లోనే ఉన్నాయి. తాజాగా హరీష్ శంకర్‌పై బీవీఎస్ రవి అదిరిపోయే కామెంట్లు చేశాడు. నిన్న షారుఖ్ ఖాన్ బర్త్ డే. ఈ సందర్భంగా హరీష్ శంకర్ షారుఖ్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ విషెస్ చేశాడు. ఇక వాటిపై బీవీఎస్ రవి స్పందించాడు.

    Harish Shankar Emotional On BVS ravi Comments About Movie With SRK

    నువ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానివి అని మాకు తెలుసు.. ఆ అభిమానాన్ని గబ్బర్ సింగ్‌లా మలిచావ్.. అలాగే నీకు షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం.. ఆయనతో కూడా ఓ సినిమా చేయాలి.. ఆ మూమెంట్ కోసం నేను ఎంతో ఎదురుచూస్తున్నాను అంటూ బీవీఎస్ రవి స్పందించాడు. ఈ ట్వీట్‌ను చూసిన హరీష్ శంకర్.. నీనోట్ల చెక్కర పొయ్య.. అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కానీ షారుఖ్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు.

    English summary
    Harish Shankar Emotional On BVS ravi Comments About Movie With SRK,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X