twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రెండు పాత్రలకు ఎంతో తేడా ఉందట.. హరీష్ శంకర్ ట్వీట్‌పై పూజా హెగ్డే రియాక్షన్ వైరల్

    |

    టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నేడు ఆ స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తోందంటే అది కచ్చితంగా హరీష్ శంకర్ మూలానే. ముకుంద చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన పూజా.. ఆపై హిందీలో హృతిక్ రోషన్ సరసన మొహంజదారో చిత్రంలో నటించింది. అది దారుణంగా బెడిసి కొట్టింది. దీంతో ఆమెను అక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆఫర్లు ఏమీ లేకుండా ఖాళీగా ఉన్న సమయంలో హరీష్ శంకర్ అదిరిపోయే అవకాశాన్ని ఇచ్చాడు.

    పూజా హెగ్డేలో అప్పటి వరకు చూడని కోణాన్ని, అందాలను తెలుగు ప్రేక్షకులకు చూపించాడు హరీష్ శంకర్. అలా డీజే సినిమా పూజా హెగ్డేకు మళ్లీ జీవం పోసింది. అది బ్లాక్ బస్టర్ హిట్ కావడం , పూజా అందాలు అందర్నీ ఆకట్టుకోవడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. ఆపై వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో చాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్‌తో అరవింద సమేత, మహేష్ బాబుతో మహర్షి, మళ్లీ అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా దూసుకపోయింది.

    Harish Shankar Special Wishes To Pooja Hegde Birthday

    మధ్యలో హరీష్ శంకర్ అడడగడంతో గద్దలకొండ గణేష్ చిత్రంలో స్పెషల్ రోల్ చేసింది. ఇలా హరీష్ శంకర్ రుణాన్ని తీర్చుకుంది. నేటి పూజా హెగ్డే బర్త్ సందర్భంగా హరీష్ శంకర్ ట్వీట్ చేస్తూ.. కష్టపడేతత్త్వం, అంకితభావం ఉన్న పూజా హెగ్డేకు హ్యాపీ బర్త్ డే అంటూ డీజే, గద్దలకొండ గణేష్ చిత్రాల్లోని పూజా క్లిప్స్‌ను షేర్ చేశాడు. ఇది చూసిన పూజా హెగ్డే.. ఆ రెండు పాత్రలకు ఎంతో తేడా ఉంది సర్ అంటూ థ్యాంక్స్ చెప్పింది.

    English summary
    Harish Shankar Special Wishes To Pooja Hegde Birthday, Many more happy returns to the most hard working and dedicated actress of our times hegdepooja have a blast dear enjoy ur day
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X