విశ్వ సుందరి పోటీల్లో భారతీయ పతాకం రెపరెప.. మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్.. రికార్డులు తిరగరాసిన అందాల భామ
ప్రపంచ అందాల పోటీలో భారతీయ యువతి విశ్వ సుందరిగా ఎంపికై కీర్తీ పతాకాన్ని ఎగురువేసింది. ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన 70వ విశ్వసుందరి పోటీలలో 21 సంత్సరాల హర్నాజ్ కౌర్ సంధూ విజేతగా నిలిచారు. భారత్ తరుఫున విశ్వసుందరిగా నిలిచిన మూడో యువతిగా రికార్డును సొంతం చేసుకొన్నది. విశ్వసుందరిగా గెలిచిన హర్నాజ్ ప్రయాణం గురించి మరిన్నీ వివరాల్లోకి వెళితే..

పర్యావరణ మార్పులు అనే అంశం ఓ భ్రమ, భ్రాంతి అని భావించే వాళ్లకు ఎలాంటి సందేశం ఇస్తారని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పర్యావరణం, ప్రకృతికి కలుగుతున్న విఘాతాన్ని చూసి నా గుండె తరుక్కుపోతుంటుంది. మన ప్రవర్తన కారణంగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నది. పర్యావరణానికి జరుగుతున్న నష్టం గురించి ఎక్కువ మాట్లాడకుండా.. చేతల్లో పనితనం చూపించాలి. మన చేతల కారణంగానే పర్యావరణానికి కలుగుతున్న నష్టాన్ని అడ్డుకోగలుగుతాం. పశ్చాత్తాపం పడటం కంటే.. నష్ట నివారణను ఎదుర్కోవడం సమాజానికి మేలు. యువతకు నేను ఇచ్చే సందేశం ఇదే అంటూ హర్నాజ్ చెప్పారు.
ఇజ్రాయెల్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో మొత్తం 80 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఆ పోటీల్లో మొదట టాప్ 16లో చోటు సంపాదించారు. ఆ తర్వాత ఈ ఈ పోటీల్లో ఎదురు చూసుకొన్న దాఖలాలు లేవు. అనంతరం టాప్ 5, టాప్ 3 జాబితాలో చోటు సంపాదించారు. టాప్ 3లో హర్నాజ్ సంధూతోపాటు పరాగ్వే, సౌతాఫ్రికా అందాల భామలు గట్టిపోటీ ఇచ్చారు.
Recommended Video
హర్నాజ్‌కు మాజీ విశ్వసుందరి, మెక్సికోకు చెందిన ఆండ్రియా మేజా ప్రేక్షకులు, నిర్వాహకులు, తోటి కంటెస్టెంట్ల జయజయధ్వానాల మధ్య కిరీటం తొడిగింది. దాంతో హర్నాజ్ కౌర్ సంధూ విశ్వ సుందరిగా నిలిచింది.


Click it and Unblock the Notifications











