Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
HBD Balakrishna: బాలయ్య ఆస్తులు, రెమ్యూనరేషన్ వివరాలివే.. ఇండియాలో అలా చేసిన ఏకైక హీరోగా రికార్డు
నందమూరి తారక రామారావు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా చిన్న వయసులోనే తనలోని సత్తాను ప్రపంచానికి పరిచయం చేసి.. స్టార్ హీరోగా ఎదిగిపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తనదైన శైలి చిత్రాలతో హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు. ఇలా సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను చేరుకున్న బాలయ్య.. ఎవరికీ సాధ్య కాని రికార్డులను ఎన్నో క్రియేట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఆయన మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు బాలకృష్ణ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తులు, రెమ్యూనరేషన్ వివరాలు తెలుసుకుందాం పదండి!

14 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చిన బాలయ్య
14 ఏళ్ల వయసులోనే నందమూరి బాలకృష్ణ ‘తాతమ్మకల' అనే సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే అద్భతమైన నటనతో ఆకట్టుకున్నారు. తద్వారా ఉత్తమ బాల నటుడిగా అవార్డులను సైతం అందుకున్నారు. దీని తర్వాత కూడా చాలా కాలం పాటు ఎన్నో గొప్ప చిత్రాల్లో భాగం అయ్యారు. వాటిలో చాలా వరకూ ఎన్టీఆర్ తెరకెక్కించిన సినిమాలే ఉన్నాయి.
మసాజ్ వీడియో షేర్ చేసిన పాయల్: బట్టలు లేకుండానే.. అది పెద్దదైందని చూపిస్తూ!

సోలో హీరోగా... యమ స్పీడుగానే
బాలయ్య 1984లో వచ్చిన ‘సాహసమే జీవితం' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. అదే ఏడాది ఏకంగా ఏడు సినిమాల్లో నటించి సత్తా చాటారు. అందులో కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘మంగమ్మ గారి మనవడు' ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ జోష్‌లో ఏడాది ఆరు నుంచి తొమ్మిది చిత్రాల వరకూ చేశారు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలనూ అందుకున్నారు.

ఎంతో మందికి లైఫ్.. ప్రయోగాలు
ఆరంభంలోనే
బడా
దర్శకులతో
సినిమాలు
చేసిన
నందమూరి
బాలకృష్ణ..
ఆ
తర్వాత
కొత్త
దర్శకులకు
అవకాశం
కల్పించారు.
అందుకే
ఆయనను
దర్శకుల
హీరో
అంటారు.
ఇక,
సుదీర్ఘమైన
కెరీర్‌లో
బాలకృష్ణ
ఎన్నో
వైవిధ్యమైన
చిత్రాలు
చేశారు.
సాంఘీకం,
జానపదం,
సోషియో
ఫాంటసీ,
సైన్స్
ఫిక్షన్,
కమర్షియల్
వంటి
ఎన్నో
జోనర్లలో
సినిమాలు
చేసి
ఔరా
అనిపించారు.
Ante Sundaraniki: నాని సినిమాకు ఊహించని టాక్.. అదే పెద్ద మైనస్.. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే!

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు
సినీ
రంగంలో
తన
సత్తాను
నిరూపించుకున్న
బాలయ్య..
తన
తండ్రి
ఎన్టీఆర్
స్థాపించిన
తెలుగుదేశం
పార్టీలో
క్రీయాశీలకంగా
పని
చేయడం
ప్రారంభించారు.
ఈ
క్రమంలోనే
2014లో
జరిగిన
సార్వత్రిక
ఎన్నికల్లో
హిందూపురం
అసెంబ్లీ
నియోజకవర్గం
నుంచి
పోటీ
చేసి
గెలుపొందారు.
అక్కడ
అద్భుతమైన
పనితీరుతో
ఆకట్టుకుని..
2019లో
మరోసారి
ఎమ్మెల్యేగా
విజయం
సాధించారు.

తల్లి పేరుతో సేవ చేస్తోన్న హీరో
హీరోగా అలరిస్తోన్న బాలయ్య సేవలోనూ ముందుంటారు. అందుకే క్లిష్ట సమయాల్లో తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎంతో మందికి, ఎన్నో దానాలు చేసిన ఆయన.. విపత్కర పరిస్థితుల్లో విరాళాలు కూడా అందించారు. ఇక, బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మందికి ప్రాణాలు నిలుపుతున్నారు. ఇలా ఎన్నో సేవలు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు.
బెడ్‌పై సరయు రాయ్ హాట్ ట్రీట్: అలా పడుకుని ఎద అందాల ఆరబోత

అలా చేసిన ఏకైక హీరోగా రికార్డ్
సుదీర్ఘమైన ప్రయాణంలో బాలకృష్ణ సాధించిన రికార్డు, అందుకున్న ఘనతలు, చేరుకున్న మైలురాళ్లు ఎన్నో ఉన్నాయి. అయితే, తన తండ్రి జీవిత కథతో ఇటీవలే బయోపిక్‌ను తెరకెక్కించారాయన. ఇలా తండ్రి పాత్రలో నటించిన ఏకైక ఇండియన్ హీరోగా బాలయ్య చరిత్ర సృష్టించారు. దురదృష్టవశాత్తూ రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం పరాజయం పాలైంది.

ఆదాయం.. రెమ్యూనరేషన్ ఇలా
బాలకృష్ణకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ ఆయన సినిమాల ద్వారా చాలా ఆదాయాన్ని వెనకేసుకున్నారు. సోషల్ మీడియా సమాచారం ప్రకారం.. బాలయ్య నికర ఆదాయం రూ. 75 - 100 కోట్లు ఉంటుందట. అలాగే, ఇల్లు, కార్లు ఇతర ఆస్తులన్నీ కలిపి మరో రూ. 100 కోట్లు ఉంటాయని అంటున్నారు. ఇక, ఒక్కో సినిమాకు రూ. 8 -15 కోట్లు చార్జ్ చేస్తారట.
పబ్లిక్ ప్లేస్‌లో సీరియల్ హీరోయిన్ రొమాన్స్: ఫ్యాన్స్ తట్టుకోనంత దారుణంగా!
Recommended Video


మాస్ అవతార్.. కామెడీ మూవీ
గత ఏడాడి ‘అఖండ'తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ.. ఇప్పుడు గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ రికార్డు స్థాయి స్పందనతో దూసుకుపోతోంది. ఇందులో ఆయన మాస్ అవతారంతో కనిపిస్తున్నారు. దీని తర్వాత అనిల్ రావిపూడితో సినిమా ఉంటుంది. ఇది కామెడీగా సాగే యాక్షన్ మూవీ అని అంటున్నారు.
నటుడిగా, నిర్మాతగా, హోస్టుగా సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తోన్న బాలకృష్ణ.. సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.