For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBD prashanth neel: ఒక్క మూవీతో బాక్సాఫీస్ దాసోహం.. స్టార్ హీరోల టార్గెట్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  |

  కన్నడ ప్రపంచం నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ నేడు 41 వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా KGF ఫ్యాన్స్ ప్రశాంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అతని కెరీర్ పై ఒక లుక్కేస్తే.. మొదట అతను దర్శకుడు అవ్వాలని అనుకోలేదట. చాలా సందర్భాల్లో డబ్బు కష్టాన్ని దాటుకుంటూ వచ్చి చివరికి సౌత్ లోనే అత్యదిక రెమ్యునరేషన్ అందుకునే దర్శకుల జాబితాలో నిలిచాడు.

  డబ్బు కోసమే వచ్చాను.. కానీ..

  డబ్బు కోసమే వచ్చాను.. కానీ..

  ప్రశాంత్ నీల్ ఒక వీక్లీ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదట డబ్బు అవసరం కోసమే ఫిల్మ్‌మేకింగ్‌లోకి వచ్చినట్లు ఓపెన్ గా చెప్పేశాడు. కొన్ని పరిస్థితుల ప్రభావం వలన చాలా సమయాల్లో డబ్బు కష్టాన్ని చూసినట్లు చెబుతూ ఇక అదే టార్గెట్ తో మొదటి అడుగు వేసినట్లు చెప్పాడు. ఇక తన బావ శ్రీమురళి యాక్టర్ కాబడంతో అతని ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు చెప్పాడు. ఆ తరువాత అవసరం మేరకు డబ్బు విలువను తెలుసుకొని కేవలం సినిమా మేకింగ్ పైనే దృష్టి పెట్టినట్లు చెప్పాడు.

  మొదటి సక్సెస్ అలా..

  మొదటి సక్సెస్ అలా..

  మొదట శ్రీమురళి నటించిన ఒక సినిమా స్క్రీన్ ప్లేను అందించిన ప్రశాంత్ ఆ తరువాత శ్రీమురళి యాక్టింగ్ స్కిల్స్ ను దృష్టిలో పెట్టుకొని ఉగ్రమ్ అనే కథను రాసుకున్నాడు.ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి ప్రశాంత్ చాలానే కష్టపడ్డాడు. శ్రీమురళి సహాయంతో మొత్తానికి హిట్టు కొట్టిన ప్రశాంత్ కు వెంటవెంటనే బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయి.

   బాహుబలి ఫార్ములాను ఉపయోగించి

  బాహుబలి ఫార్ములాను ఉపయోగించి

  అదే కసితో KGF ( కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) కథను చాలా తొందరగానే సెట్ చేసుకున్నాడు. యష్ కూడా ప్రశాంత్ ను నమ్మి తన శక్తికి మించి సినిమా కోసం కష్టపడ్డాడు. ఇక ఆ సినిమాను మొదట ఒక్క పార్ట్ లోనే తీయాలని అనుకున్నారు. కానీ బాహుబలి ఫార్ములాను ఉపయోగించి దర్శకుడు కథను మరింత బలంగా మార్చాడు. KGF చాప్టర్ 1తోనే నేషనల్ వైడ్ గా ప్రశాంత్ నీల్ క్రేజ్ అందుకున్నాడు.

  బాక్సాఫీస్ దాసోహం

  బాక్సాఫీస్ దాసోహం

  KGF 1 వసూళ్ల వర్షానికి బాక్సాఫీస్ అతనికి దాసోహం అయ్యింది. దీంతో అదే ఎనర్జీతో KGF చాప్టర్ 2ను కూడా రెడీ చేశారు. ఇక ఆ సినిమా ప్రీ రిలీజ్ లెక్కలతోనే షాక్ ఇచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే స్టార్ హీరోల రేంజ్ లో బిజినెస్ చేసే అవకాశం ఉంది. చూస్తుంటే సౌత్ ఈజీగా బాహుబలి రికార్డులను బ్రేక్ చేయవచ్చని టాక్ అయితే వస్తోంది.

  Tollywood హీరో పై Prashant Neel ఫోకస్ | NTR 31 | Salaar | KGF Chapter 2 || Filmibeat Telugu
  రెమ్యునరేషన్ ఎంతంటే..

  రెమ్యునరేషన్ ఎంతంటే..

  ఇక మొదట ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ లక్షల్లోనే ఉండేది. ఇక ఇప్పుడు కోట్లకు వచ్చేసింది. KGF 1 అనంతరం స్టార్ హీరోలందరు అతనే టార్గెట్ చేశారు. ఇక వెంటనే ప్రభాస్ తో సలార్ సినిమాను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ తో కూడా సినిమా సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ 10కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఒకవేళ KGF 2 , సలార్, ఎన్టీఆర్ సినిమాలు మరో లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేయగలిగితే అతని రెమ్యునరేషన్ మరింత పెరుగుతుంది. ఈజీగా టాప్ 5 ఇండియన్ దర్శకుల్లో అతను చోటు సంపాదించుకోవడం కాయమని తెలుస్తోంది.

  English summary
  After Salar, director Prashant Neel is all set to direct NTR's 31st film. The talk is that the director of the film is getting a lower remuneration as compared to other Pan India directors. Rajamouli is taking less than Rs 10 crore than Sukumar. There is a reason for that,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X