Don't Miss!
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రేమతో భార్యకు ముద్దు.. బర్త్ డే స్పెషల్ పిక్ షేర్ చేసిన నమ్రత
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు (ఆగస్ట్ 9). ఇక నేడు మహేష్ బాబుపై విషెస్ వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ సినీ ప్రముఖులే కాకుండా యావత్ భారత సినీ ప్రముఖులందరూ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ అందరూ ప్రేమగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహేష్ బాబుకు లేడీ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్లలోనూ ఎంతో మంది మహేష్ బాబు అంటే పడి చచ్చిపోతారు.
అలాంటి మహేష్ బాబును నమత్ర సొంతం చేసుకుంది. వంశీ సినిమాతో మొదలైంది వీరి ప్రేమ ప్రయాణం. నేటికీ ఎంతో అన్యోన్యంగా, మునుపటి కంటే రెట్టింపు ప్రేమతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మహేష్ బాబుకు అన్నీ తానై ముందుండి నడిపిస్తూ ఉంటుంది. మహేష్ బాబు వ్యవహారాలన్నీ దగ్గరుండి మరీ జాగ్రత్తగా చూసుకుంటుంది. మహేష్ బాబు, పిల్లల పట్ల ఎంత జాగ్రత్త వహిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
నిత్యం వీరు చేసే అల్లరిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక నేడు భర్త పుట్టిన రోజు సందర్భంగా ఓ స్పెషల్ పిక్‌ను షేర్ చేసింది. ఎంతో ప్రేమగా భర్త తనకు ముద్దు పెడుతూ ఉంటే.. ఆ ఎమోషన్‌ను సెల్ఫీ ద్వారా బంధించింది నమ్రత.
ఈ ఫోటోను షేర్ చేస్తూ.. 'నీతో ఉన్న అనుభవాలే, నీ వల్ల కలిగే అనుభూతులే నిజమైన ప్రేమ.. హ్యాపీ బర్త్ డే ఎంబీ.. ఇప్పుడు ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ ఎమోషనల్ అయింది. ఇక సర్కారు వారి పాట మోషన్ పోస్టర్‌పై నమ్రత ప్రశంసలు కురిపించింది. నేడు మహేష్ బాబు బర్త్ డే ఎంతగా ట్రెండ్ అవుతుందో.. వీరిద్దరి ఫోటో, సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ కూడా అంతే ట్రెండ్ అవుతున్నాయి.