అన్నింటిని కలిపి ఒకే పదంలో చెబుతాను.. చిరుపై శ్రీజ ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవికి ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అందులో అందరూ కలిసి ఉండాలని, అందరూ తన కళ్ల ముందే ఉండాలని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకునే వ్యక్తి. అందుకే ఏదైనా పండుగలు వస్తే అందర్నీ ఒకచోట సమూహపరిచేలా చేస్తాడు. మరీ ముఖ్యంగా చిరంజీవికి తన కూతుళ్లైనా హని(సుష్మిత), స్వీటి (శ్రీజ)లంటే మరింత మక్కువ. చిన్న కూతురైన శ్రీజ అంటే వల్లమాలిన ప్రేమ.
శ్రీజకు మొదటి వివాహాం కలిసి రాకపోయినా.. అక్కున చేర్చుకుని మళ్లీ ఘనంగా రెండో వివాహాం చేయించాడు. శ్రీజ ఆనందంగా ఉండాలని అనుక్షణం ఆలోచిస్తాడు. అందుకే ప్రతీ పండుగ శ్రీజ ఫ్యామిలీని ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానిస్తాడు కూడా. నేడు మెగా ఇంట్లో రెండు పండుగలు వచ్చాయి. ఒకటి వినాయక చవితి అయితే రెండోది మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా ఇంట్లో ఆనందం రెట్టింపైంది.

తాజాగా శ్రీజ తన తండ్రితో కలిసి ఆప్యాయంగా దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు పోస్ట్ చేస్తూ.. 'నా రాక్ స్టార్‌కు హ్యాపీ బర్త్ డే.. నేను ఈ పోస్ట్ రాసేప్పుడు నా మదిలో ఎన్నో ఆలోచనలు, ఇంకెన్నో విషయాలు తిరిగాయి.. ఎన్నెన్నో చెప్పాలనుకున్నాను. అయితే వాటన్నంటిని ఒకే పదంలో చెప్పాలని అనుకుంటే మాత్రం ఆ పదమే కృతజ్ఞత. థాంక్యూ డాడ్.. లవ్యూ' అంటూ ఎమోషనల్ అయింది. చిరు బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఆచార్య మోషన్ పోస్టర్ తెగ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











