HBD Chiranjeevi: అలా వచ్చి అందరివాడిలా.. ఇండియాలో ఏకైక హీరోగా రికార్డు.. చిరు గురించి ఈ నిజాలు తెలుసా?
ఎవరి సపోర్ట్ లేకుండానే సినిమాల్లోకి వచ్చి.. పెద్ద స్టార్లను మించిపోయే స్థాయికి చేరుకున్నారు చిరంజీవి. నటనతో పాటు డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్, స్టైల్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఆయన.. ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకుని మెగాస్టార్ అయ్యారు. అప్పటి నుంచి ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తోన్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటూ రియల్ హీరో అందరివాడు అనిపించుకుంటున్నారు. నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం పదండి!
చిరంజీవి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్
చిరంజీవి 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు జన్మించారు. ఆయన 1980లో అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు. చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అలాగే, ఆయనకు తమ్ముళ్లు పవన్, నాగబాబుతో పాటు ఇద్దరు సిస్టర్లు కూడా ఉన్నారు.

అలా ఎంట్రీ.. ఖైదీతో స్టార్‌గా
1978లో 'పునాదిరాళ్లు' సినిమాతో మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే, 1983లో వచ్చిన 'ఖైదీ' అనే సినిమా.. చిరంజీవిని కెరీర్‌ను టర్న్ చేసింది. ఇందులో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే, ఈ చిత్రంతోనే ఆయన స్టార్‌గానూ మారిపోయారు.
ఎన్నో హిట్లు.. ఇవి హైలైట్‌గా
'ఖైదీ' మూవీ తర్వాత కూడా చిరంజీవికి ఎన్నో హిట్లు వచ్చాయి. అందులో 'చంటబ్బాయ్', 'ఛాలెంజ్', 'అభిలాష', 'శుభలేఖ', 'గ్యాంగ్ లీడర్', 'రౌడీ అల్లుడు', 'ఘరానా మొగుడు', 'స్వయం కృషి', 'యముడికి మొగుడు', 'అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు', 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'ఇంద్ర', 'ఠాగూర్'లు హైలైట్ అయ్యాయి.

సేవలతో అందరివాడిలానే
ఒకవైపు సినిమాలు చేస్తూనే చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరివాడు అనిపించుకున్నారు. ముఖ్యంగా అప్పట్లో బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఐ (కంటి) బ్యాంక్‌ను కూడా స్థాపించారు. కష్ట సమయంలో విరాళాలు ఇచ్చి అండగా నిలబడ్డారు. కరోనా సమయంలో ఆక్సీజన్ బ్యాంక్‌లు ఏర్పాటు చేశారు. ఇలా ఎంతో మందికి ప్రాణదానం కూడా చేశారు.
రీఎంట్రీ.. ఫుల్ స్పీడ్ జర్నీ
రాజకీయాల కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు. ఇది సక్సెస్ అవడంతో ఆయన జెట్ స్పీడ్‌తో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే 'సైరా: నరసింహారెడ్డి', 'ఆచార్య', 'గాడ్ ఫాదర్', 'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్' సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన 'విశ్వంభర' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఎన్నో ఉత్తమ గౌరవాలతో
సినిమాలు, ప్రజా సేవతో సాగిపోతోన్న చిరంజీవిని ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ పురస్కారంతో ఆయనను సత్కరించింది. అలాగే, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటును అందుకున్నారు. వీటితో పాటు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు, నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆయనను వరించాయి. మరీ ముఖ్యంగా ఇటీవలే చిరంజీవికి పద్మవిభూషన్ పురస్కారం దక్కింది.
ఇండియాలో ఏకైక హీరోగా
ఎన్నో సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి మాస్ డ్యాన్స్‌తో అలరించారు. ఈ క్రమంలోనే 'పసివాడి ప్రాణం' చిత్రం ద్వారా తెలుగు తెరకే కాదు.. ఇండియా మొత్తానికే తొలిసారి 'బ్రేక్ డ్యాన్స్' ఎలా ఉంటుందో చూపించారు. అలాగే, ఎన్నో సినిమాల్లో భారీ కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేశారు. అలాగే, ఎక్కువ కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాల విషయంలోనూ చిరు రికార్డు సాధించారు.
ఇలా మరెన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తూ.. ప్రజాసేవలోనూ ముందుంటూ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











