Don't Miss!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- News అప్పుడు వైసీపీ..ఇప్పుడు టీడీపీ.. యంగ్ హీరో ఇలా మారిపోయాడేంటి..!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నయన్ బర్త్ డే.. వెంకీ, మారుతి ట్వీట్స్ వైరల్
లేడీ సూపర్ స్టార్ నయన తార బర్త్ డే (నవంబర్ 18) సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. సౌత్ సూపర్ స్టార్ నయన్ బర్త్ డే అంటే సోషల్ మీడియాలో ఏ రేంజ్లో ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే. నయన్ బర్త్ డే సందర్భంగా నెట్రికన్ అనే కొత్త సినిమా టీజర్ విడుదల చేశారు. అందులో అంధురాలిగా నటించి అదరగొట్టేసింది. నయన్ ఫ్యాన్స్‌కు ఇది డబుల్ ట్రీట్‌లా అనిపిస్తోంది. నయన్ బర్త్ డే ఓ వైపు ట్రెండ్ అవుతుంటే.. మరో వైపు నెట్రికన్ టీజర్ వైరల్ అవుతోంది.
ఈ మేరకు సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు నయన్‌కు స్పెషల్ విషెస్ అందిస్తున్నారు. బాబు బంగారం మూవీతో నయన్‌ను డైరెక్ట్ చేసిన మారుతి స్పెషల్ విషెస్ అందించాడు. బాబు బంగారం సెట్లో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ నయనతారకు బర్త్ డే విషెస్ తెలిపాడు. హ్యాపీ బర్త్ డే లేడీ సూపర్ స్టార్.. మీకు ఇంకా ఎన్నో విజయవంతమైన చిత్రాలు రావు.. ఎంతో సాధించాలని కోరుకున్నాడు.
విక్టరీ వెంకటేష్ నయనతార కాంబో అంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ జంట సూపర్ హిట్ జంట అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. తాజాగా వెంకీ చెప్పిన విషెస్ నయనతారపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని చాటుతున్నాయి. హ్యాపీ బర్త్ డే డియర్ నయనతార అని చెప్పుకొచ్చాడు. మున్ముందు నీకు అంతా మంచే జరగాలి అని వెంకటేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.