For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBD Pawan Kalyan: పవన్‌కు అన్ని కోట్ల ఆస్తులు.. ఇండియాలోనే ఇదో రికార్డు.. ఆమె వల్లే సినిమాల్లోకి!

  |

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా ప్రాంతాల్లో అభిమానులను సంపాదించుకున్న హీరో. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడతను. తెలుగులోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకం అనే చెప్పాలి. అందుకే టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకెళ్తూనే ఉన్నాడు. సినిమాల పరంగానే కాదు.. ప్రజాసేవలోనూ ఎప్పుడూ ముందుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇక, ఈరోజు పవన్ కల్యాణ్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని ఆయన జీవితంలో జరిగిన కొన్ని మధుర ఘట్టాలు.. ఆస్తులు.. రెమ్యూనరేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి!

  పవన్ కల్యాణ్ కుటుంబ నేపథ్యం

  పవన్ కల్యాణ్ కుటుంబ నేపథ్యం

  పవన్ కల్యాణ్.. కొణిదెల వెంకటరావు, అంజనా దేవిలకు 1971 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తండ్రి కానిస్టేబుల్ కావడంతో ఆయన ఉద్యోగం చేస్తే పవన్ అక్కడ చదువుకోవాల్సి వచ్చింది. అందుకే ఆయన చదువు ఒక దగ్గర సాగలేదు. పది వరకు ఎన్నో స్కూళ్లు మారిన పవన్.. ఇంటర్ మాత్రం నెల్లూరులో చదివాడు.

  రంగరంగ వైభవంగా ట్విట్టర్ రివ్యూ: వైష్ణవ్ తేజ్ మూవీకి ఊహించని టాక్.. అసలైందే మిస్ అవడమే మైనస్

  వదిన వల్లే సినిమాల్లోకి వచ్చాడు

  వదిన వల్లే సినిమాల్లోకి వచ్చాడు

  పెద్ద చదువులు చేయడం ఇష్టం లేని పవన్ కల్యాణ్.. ఆ తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో పుస్తకాలు చదవడం, ఒంటరిగా ఉండడం చేసేవాడు. ఇది గమనించిన వదిన (చిరు భార్య) సురేఖ.. చిరంజీవితో పవన్ గురించి మాట్లాడారట. ఆయనను ఎలాగైనా సినిమాల్లోకి తీసుకెళ్లమని సూచించారట. పవన్‌ను కూడా ఆమె బలవంతంగా ఒప్పించి హీరోను చేశారట.

  మార్షల్ ఆర్ట్స్‌తో గ్రాండ్‌ ఎంట్రీ

  మార్షల్ ఆర్ట్స్‌తో గ్రాండ్‌ ఎంట్రీ

  హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఎలాగోలా ఒప్పుకున్న పవన్ కల్యాణ్.. తన ఎంట్రీ అల్లాటప్పాగా ఉండకూడదని అనుకున్నాడు. అందుకోసం ఎన్నో శిక్షణలు తీసుకున్నాడు. ఆ తర్వాత అంటే 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇందులో తన మార్షల్ ఆర్ట్ సత్తాను చూపించి ఆరంభంలోనే అందరి దృష్టిలో పడ్డాడు.

  ఫస్ట్ డే ఫస్ట్ షో ట్విట్టర్ రివ్యూ: సినిమాకు షాకింగ్ టాక్.. ఏది ప్లస్ అవ్వాలో అదే మైనస్‌గా!

  భారీ హిట్లు... కోట్ల మంది ఫ్యాన్స్

  భారీ హిట్లు... కోట్ల మంది ఫ్యాన్స్

  సుదీర్ఘమైన కెరీర్‌లో పవన్ కల్యాణ్ ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. అందులో చాలా వరకూ భారీ విజయాలు సాధించిన చిత్రాలు ఉన్నాయి. అందులో 'సుస్వాగతం', 'తమ్ముడు', 'తొలిప్రేమ', 'బద్రి', 'ఖుషీ', 'గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది' వంటివి ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. దీంతో పవన్‌కు కొన్ని కోట్ల మంది అభిమానులు సొంతం అయ్యారు.

  పాలిటిక్స్ కోసం గ్యాప్ ఇచ్చాడు

  పాలిటిక్స్ కోసం గ్యాప్ ఇచ్చాడు

  2009 అసెంబ్లీ ఎన్నికల ముందు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రచారం చేశాడు. ఆ తర్వాత అంటే 2014 మార్చి 14న జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ గ్యాప్‌లో ఎన్నికలు రావడం.. అందులో పవన్ ఓడిపోవడంతో మళ్లీ సినిమాల వైపు చూశాడు.

  ఆ సీరియల్ నటితో ప్రేమలో పడ్డ హైపర్ ఆది: ఆ షోలో బయటపెట్టిన కమెడియన్

  రీఎంట్రీలోనూ జెట్ స్పీడుతోనే

  రీఎంట్రీలోనూ జెట్ స్పీడుతోనే


  దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీని తర్వాత ఈ స్టార్ హీరో 'భీమ్లా నాయక్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి కూడా మంచి స్పందనే దక్కింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

  లైన్‌లో రెండు... వాళ్లతో కూడా

  లైన్‌లో రెండు... వాళ్లతో కూడా

  ప్రస్తుతం పవన్ కల్యాణ్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. అలాగే, స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తోనూ 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా చేయనున్నాడు. అది త్వరలోనే మొదలవుతుంది. వీటితో పాటు 'వినోదయ సీతమ్' రీమేక్ ఒకటి.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరొకటి చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

  అషు రెడ్డి అందాల ప్రదర్శన: ఏకంగా షర్ట్ విప్పేసి మరీ చూపిస్తూ!

  అలా చేసిన ఏకైక ఇండియన్

  అలా చేసిన ఏకైక ఇండియన్

  తన సినీ కెరీర్‌లో పవన్ కల్యాణ్ ఎన్నో అవార్డులు, రికార్డులు, ఘనతలను సొంతం చేసుకున్నాడు. హీరోగా తన స్టామినాను ఎప్పుడో నిరూపించుకున్న అతడు.. తన సినీ ప్రయాణంలో ఎన్నో రకాల ప్రయోగాలు చేశాడు. ఇక, ఇండియాలోనే ఏ స్టార్ చేయని విధంగా సింగర్‌గా, స్టంట్ కొరియోగ్రాఫర్‌గా, డ్యాన్స్ మాస్టర్‌గా, డైరెక్టర్‌గా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, నిర్మాతగానూ వ్యవహరించాడు.

  పవన్ ఆస్తులు, రెమ్యూనరేషన్

  పవన్ ఆస్తులు, రెమ్యూనరేషన్

  పవన్ కల్యాణ్‌కు దాదాపు రూ. 120 కోట్ల ఆస్తులు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే, దాదాపు 100 కోట్ల విలువున్న ప్రాపర్టీలు కూడా ఉన్నాయట. అలాగే, కార్లు, ఇల్లు మిగతా యాక్ససిరీస్‌ల విలువ 50 - 100 కోట్లు ఉంటుందట. అంతేకాదు, పవన్ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 40 - 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

  సినీ హీరోగా, రాజకీయ నాయకుడిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నో విజయాలను చూడాలని.. ప్రజాసేవ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

  English summary
  Tollywood Star Hero Pawan Kalyan Birthday Today. On The Occasion of His Birthday.. Let we Know his Net Worth and Remuneration.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X