HBD Pawan: అలా చేసిన ఏకైక ఇండియన్ హీరో.. ఆమె వల్లే పవర్‌స్టార్‌గా.. పవన్ గురించి ఈ నిజాలు తెలిస్తే!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు పెద్ద సెన్సేషన్.. దీని వెనుక ఉంది ఒక ఎమోషన్. అంతలా కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకుని స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు. అదే సమయంలో రాజకీయాల్లోనూ తనదైన మార్కును చూపిస్తూ ముందుకు సాగుతోన్నాడు.

ఇలా సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అసలు పవన్ కల్యాణ్ సినిమాల్లోకి ఎలా వచ్చాడు? అతడిని స్టార్‌గా మార్చిన సినిమాలేంటి? ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నాడు? వంటి అంశాలపై ఓ లుక్కేద్దాం పదండి!

HBD Pawan Kalyan: Unknown Facts about Pawan Kalyan Film Career

పవన్ కుటుంబం.. చదువు ఇలా: కొణిదెల వెంకటరావు, అంజనా దేవిలకు పవన్ కల్యాణ్ 1971 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించాడు. అతడికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. తండ్రి కానిస్టేబుల్ కావడంతో ఆయన ఉద్యోగం చేస్తే పవన్ అక్కడ చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే విద్యాభ్యాసం ఒక దగ్గర సాగలేదు. పది వరకు ఎన్నో స్కూళ్లు మారిన పవన్.. ఇంటర్ మాత్రం నెల్లూరులో చేశాడు.

HBD Pawan Kalyan: Unknown Facts about Pawan Kalyan Film Career

ఆమె వల్లే సినిమాల్లోకి వచ్చాడు: పైచదువులు చదవడం ఇష్టం లేకపోవడంతో పవన్ కల్యాణ్ ఒంటరితనానికి అలవాటు అయిపోయాడు. అతడి పరిస్థితిని గమనించిన వదిన (చిరు భార్య) సురేఖ.. చిరంజీవితో చర్చించారట. పవన్‌ను ఎలాగైనా సినిమాల్లోకి తీసుకెళ్లమని సూచించారట. ఈ క్రమంలోనే అతడికి ఇష్టం లేకపోయినా సురేఖ స్వయంగా ఒప్పించారట. ఈ విషయాన్ని పవర్‌ స్టారే స్వయంగా వెల్లడించాడు.

HBD Pawan Kalyan: Unknown Facts about Pawan Kalyan Film Career

ఆరంభంలోనే అదిరే ఫీట్లు చేసి: హీరోగా ఎంట్రీ ఇచ్చేటప్పుడే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ రావాలని భావించిన పవన్ కల్యాణ్.. నటనతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకున్నాడు. అలా 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రం ద్వారా హీరోగా వచ్చాడు. ఇందులో అదిరిపోయే ఫీట్లు చేసి తన ఎంట్రీని చాటుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తూ ఈ సినిమా విజయాన్ని అందుకోలేదు.

HBD Pawan Kalyan: Unknown Facts about Pawan Kalyan Film Career

ఇండస్ట్రీ హిట్లు.. ఫుల్ మార్కెట్: పవన్ కల్యాణ్ సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. అందులో చాలా వరకూ భారీ విజయాలు సాధించిన చిత్రాలు ఉన్నాయి. అందులో 'సుస్వాగతం', 'తమ్ముడు', 'తొలిప్రేమ', 'బద్రి', 'ఖుషీ', 'గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది' వంటివి ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఇవి పవన్‌ ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను విపరీతంగా పెంచేశాయి.

HBD Pawan Kalyan: Unknown Facts about Pawan Kalyan Film Career

అందుకే గ్యాప్.. వకీల్ సాబ్‌తోనే: 2009 సార్వత్రిక ఎన్నికల ముందు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కోసం పవన్ కల్యాణ్ పని చేశాడు. ఇక, 2014 మార్చి 14న జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ గ్యాప్‌లో ఎన్నికలు రావడం.. అందులో పవన్ ఓడిపోవడం జరిగాయి. ఇక, మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇచ్చాడు.

HBD Pawan Kalyan: Unknown Facts about Pawan Kalyan Film Career

అప్పటి నుంచి వరుస మూవీలే: 'వకీల్ సాబ్' మూవీతో గ్రాండ్ రీఎంట్రీని సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దీని తర్వాత 'భీమ్లా నాయక్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి అదిరిపోయే స్పందన లభించడంతో వసూళ్లు భారీగానే వచ్చాయి. దీని తర్వాత పవన్ కల్యాణ్ 'బ్రో' అనే సినిమాతో వచ్చాడు. కానీ, ఇది మాత్రం అతడికి నిరాశనే మిగిల్చిందని చెప్పుకోవాలి.

HBD Pawan Kalyan: Unknown Facts about Pawan Kalyan Film Career

ఇప్పుడు ఆ సినిమాలతో బిజీగా: పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే సినిమా చేస్తున్నాడు. అలాగే, స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తోనూ 'ఉస్తా భగత్ సింగ్', సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ' అనే సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరొకటి చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

HBD Pawan Kalyan: Unknown Facts about Pawan Kalyan Film Career

ఇండియాలోనే ఏకైక హీరోగా: పవన్ కల్యాణ్ తన సినీ కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రికార్డులు, ఘనతలను అందుకున్నాడు. ముఖ్యంగా ఇండియాలోనే ఏ స్టార్ చేయని విధంగా సింగర్‌గా, స్టంట్ కొరియోగ్రాఫర్‌గా, డ్యాన్స్ మాస్టర్‌గా, డైరెక్టర్‌గా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, నిర్మాతగానూ వ్యవహరించి రికార్డు సాధించాడు. అలాగే, కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటూ దాన్ని ప్రజల కోసమే ఖర్చు చేస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నాడు.

సినీ హీరోగా, రాజకీయ నాయకుడిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నో విజయాలను చూడాలని.. ప్రజాసేవ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X