Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
HBD Prabhas.. డియరెస్ట్ అంటోన్న దీపిక.. నిక్ నేమ్ బయట పెట్టిన అనుష్క
ప్రభాస్ బర్త్ డే అంటే కేవలం టాలీవుడ్లో మాత్రమే కాదే దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది. బాలీవుడ్, కోలీవుడ్ ఇలా తేడా లేకుండా అన్ని ప్యాన్ ఇండియన్ స్టార్ హోదాలో ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతర్జాతీయ వేదికల్లో ఇండియన్ సినిమాకు ప్రతినిధిగా మారిపోయాడు ప్రభాస్. హాలీవుడ్ సూపర్ హీరోస్‌లా ప్రభాస్ ఇండియన్ సినిమాకు సూపర్ హీరోగా నిలిచాడు. అలాంటి ప్రభాస్ బర్త్ డే అంటే నేషనల్ వైడ్ ట్రెండ్ అవ్వాల్సిందే.
దేశవ్యాప్తంగా విషెస్..
ప్రభాస్ బర్త్ డే సోషల్ మీడియాలో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రభాస్‌కు విషెస్ అందాయి. ఇక ప్రభాస్ అభిమానులు ట్విట్టర్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రాధేశ్యామ్ అప్డేట్తో పాటు, డార్లింగ్ బర్త్ డేను వైరల్ చేశారు.
టాలీవుడ్ స్పెషల్ విషెస్..
డార్లింగ్ ప్రభాస్‌కు టాలీవుడ్ సెలెబ్రిటీలు స్పెషల్ విషెస్ చేశారు. చిరంజీవి, మహేష్ బాబు చెప్పిన విషెస్ తెగ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు పుత్రోత్సాహంలో పెట్టిన ట్వీట్ అందర్నీ ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి.. హద్దులను, రికార్డులను చెరిపేయాలి అంటూ కోరాడు.
దీపిక అలా అనేసింది..
ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాలో దీపిక పదుకొణె హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్‌తో నటించడం ఎంతో ఆనందంగా ఉందని ఆ మధ్య దీపిక ట్వీట్ చేసింది. ఇక తాజాగా డియరెస్ట్ అంటూ సంబోధిస్తూ ప్రభాస్‌కు ఎంతో స్వీటుగా విషెస్ తెలిపింది. ఏడాదంతా మంచి జరగాలి ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంది.
నిక్ నేమ్ బయటపెట్టేసింది..
ప్రభాస్ అనుష్క అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. వీరిద్దరి జంటను మెచ్చుకోని తెలుగు వారెవ్వరూ ఉండరు. ఈ ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ గురించి, ప్రభాస్ బర్త్ డే గురించి చెబుతూ నిక్ నేమ్‌ను బయటపెట్టేసింది. పుప్సు అంటూ ప్రభాస్‌ను అనుష్క ముద్దుగా పిలుస్తుందని తాజాగా అందరికీ అర్థమైపోయింది.