twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Prabhas.. డియరెస్ట్ అంటోన్న దీపిక.. నిక్ నేమ్ బయట పెట్టిన అనుష్క

    |

    ప్రభాస్ బర్త్ డే అంటే కేవలం టాలీవుడ్‌లో మాత్రమే కాదే దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది. బాలీవుడ్, కోలీవుడ్ ఇలా తేడా లేకుండా అన్ని ప్యాన్ ఇండియన్ స్టార్ హోదాలో ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతర్జాతీయ వేదికల్లో ఇండియన్ సినిమాకు ప్రతినిధిగా మారిపోయాడు ప్రభాస్. హాలీవుడ్ సూపర్ హీరోస్‌లా ప్రభాస్ ఇండియన్ సినిమాకు సూపర్ హీరోగా నిలిచాడు. అలాంటి ప్రభాస్ బర్త్ డే అంటే నేషనల్ వైడ్ ట్రెండ్ అవ్వాల్సిందే.

     దేశవ్యాప్తంగా విషెస్..

    దేశవ్యాప్తంగా విషెస్..

    ప్రభాస్ బర్త్ డే సోషల్ మీడియాలో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రభాస్‌కు విషెస్ అందాయి. ఇక ప్రభాస్ అభిమానులు ట్విట్టర్‌లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రాధేశ్యామ్ అప్డేట్‌తో పాటు, డార్లింగ్ బర్త్ డేను వైరల్ చేశారు.

    టాలీవుడ్ స్పెషల్ విషెస్..

    టాలీవుడ్ స్పెషల్ విషెస్..

    డార్లింగ్ ప్రభాస్‌కు టాలీవుడ్ సెలెబ్రిటీలు స్పెషల్ విషెస్ చేశారు. చిరంజీవి, మహేష్ బాబు చెప్పిన విషెస్ తెగ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు పుత్రోత్సాహంలో పెట్టిన ట్వీట్ అందర్నీ ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి.. హద్దులను, రికార్డులను చెరిపేయాలి అంటూ కోరాడు.

     దీపిక అలా అనేసింది..

    దీపిక అలా అనేసింది..

    ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాలో దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్‌తో నటించడం ఎంతో ఆనందంగా ఉందని ఆ మధ్య దీపిక ట్వీట్ చేసింది. ఇక తాజాగా డియరెస్ట్ అంటూ సంబోధిస్తూ ప్రభాస్‌కు ఎంతో స్వీటుగా విషెస్ తెలిపింది. ఏడాదంతా మంచి జరగాలి ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంది.

    నిక్ నేమ్ బయటపెట్టేసింది..

    నిక్ నేమ్ బయటపెట్టేసింది..

    ప్రభాస్ అనుష్క అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. వీరిద్దరి జంటను మెచ్చుకోని తెలుగు వారెవ్వరూ ఉండరు. ఈ ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ గురించి, ప్రభాస్ బర్త్ డే గురించి చెబుతూ నిక్ నేమ్‌ను బయటపెట్టేసింది. పుప్సు అంటూ ప్రభాస్‌ను అనుష్క ముద్దుగా పిలుస్తుందని తాజాగా అందరికీ అర్థమైపోయింది.

    English summary
    HBD Prabhas Deepika Padukone And Anushka shetty Tweet Goes Viral, Prabhas Beats Of Radhe Shyam Review, Prabhas Beats Of Radhe Shyam Review, Needless to say, Prabhas' craze, which entered Tollywood as the successor of Rebel star Krishna Raju, is now at a special level. Prabhas, who rose to be the king of the box office with the film Bahubali, is celebrating his 41st birthday today. And millions of fans are offering him his best birthday wishes. Celebrities are also wishing Prabhas a happy birthday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X