మరోసారి నిరూపించావ్.. రవితేజపై నాగబాబు కామెంట్స్
మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ పద్దతిని ఫాలో అవుతున్నాడు. తనకు తెలిసిన వారి పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్‌గా విషెస్ చెబుతున్నాడు. వివిద రంగాల్లోని ప్రముఖులకు బర్త్ డే విషెస్ చెబుతూ వస్తున్నాడు. పైగా సినీ సెలెబ్రిటీలకు చెప్పడంతో నాగబాబు ముందుంటున్నాడు. తాజాగా మాస్ మహారాజా రవితేజకు కూడా విషెస్ అందించాడు. ఈమేరకు నాగబాబు షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
నేడు (జనవరి 26) మాస్ మహారాజా రవితేజ బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నాడు. అసలే ఇప్పుడు క్రాక్ హిట్ అయిన జోరు మీదున్నాడు. బాక్సాఫీస్ వద్ద నేటికీ జోరు కొనసాగిస్తున్నాడు. మొదటి సారిగా యాభై కోట్ల క్లబ్‌లో చేరడంతో రవితేజకు ఈ బర్త్ డే మరింత స్పెషల్‌గా మారింది. దీంతో రవితేజ ఫుల్ ఖుషీలో ఉన్నాడు. అదే ఊపులో ఖిలాడీకి సంబంధించిన అప్డేట్‌ను కూడా ఇచ్చాడు.

అలా రవితేజ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. అందులో నాగబాబు చేసిన కామెంట్లు సైతం వైరల్ అవుతున్నాయి. డియర్ మాస్ మహారాజ రవితేజకు హ్యాపీ బర్త్ డే. నీ ఎనర్జీ అనేది ఆరని మంట అని మరోసారి క్రాక్ మూవీతో నిరూపించావ్.. నిన్ను స్క్రీన్ మీద చూసిన ప్రతీ సారి ఎంతో సంతోషంగా ఉంటుంది.. ఖిలాడీ మూవీకి ఆల్ ది బెస్ట్ అంటూ నాగబాబు పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











