మరణం అంచుల వరకు మెగా మేనల్లుడు.. సాయిధరమ్ తేజ్‌కు ఎన్ని కోట్ల ఆస్తులంటే?

మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్.. తన ప్రతిభను నిరూపించుకొంటూ మెగా హీరోల్లో సక్సెస్‌ఫుల్‌ యాక్టర్‌గా మారారు. ఆరంభంలోనే వరుస విజయాలు అందుకొన్న యంగ్ హీరోకు జీవితంలో చాలా అగ్నిపరీక్షగా మారిన సమస్యలు ఎదురయ్యాయి. వాటిన్నింటిని తట్టుకొని కొత్త జీవితాన్ని ఆరంభించారు. ఓ దశలో మరణం అంచుల వరకు వెళ్లిన మెగా హీరో.. పునర్జన్మను సాధించారని చెప్పుకొంటారు. అక్టోబర్ 15వ తేదీ సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు.. ఆయన కెరీర్, నికర ఆస్తుల వివరాల్లోకి వెళితే..

చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబుకు ముద్దుల అల్లుడిగా రేయ్ అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ ఆ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో పడటంతో పిల్ల నీవు లేని జీవితంతో హిట్ అందుకొన్నారు. సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి సినిమాలతో వరుస సక్సెస్‌లో దూసుకెళ్లాడు.

HBD Sai Durga Tej Sai Dharam Tej net Worth and Remuneration details on Happy His birthday

అయితే మధ్యలో వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో సక్సెస్ జోరు తగ్గింది. తిక్క, విన్నర్, నక్షత్రం సినిమా ఘోర పరాజయాన్ని పొందడంతో కెరీర్ గ్రాఫ్‌కు బ్రేక్ పడింది. జవాన్, ఇంటెలింట్, తేజ్ ఐ లవ్ యూ సినిమాలు ఆశించినంతగా వర్కవుట్ కాలేదు.

కానీ చిత్రలహరితో సక్సెస్ బాట పట్టారు. ప్రతీ రోజు పండగే, సోలో బ్రతుకు సో బెటర్, రిపబ్లిక్, విరూపక్షతో భారీ విజయాలు అందుకొన్నారు. విరూపాక్ష చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన బ్రో చిత్రం బ్లాక్ బస్టర్‌ ఫలితాన్ని అందించింది.

HBD Sai Durga Tej Sai Dharam Tej net Worth and Remuneration details on Happy His birthday

కెరీర్ పరంగా ఒడిదుడుకులతో సాగుతున్న సాయిధరమ్ తేజ్.. ఊహించని విధంగా యాక్సిడెంట్ గురి కావడం మెగా ఫ్యామిలీని, అభిమానులను ఆందోళనకు గురిచేసింది. కోమాలోకి వెళ్లిన ఆయన జీవన్మరణ సమస్య నుంచి బయటపడ్డారు. యాక్సిడెంట్ నుంచి కోలుకొన్న తర్వాత విరూపాక్ష, బ్రో సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్నారు.

ఇక ఇటీవల సాయిధరమ్ తేజ్ నుంచి సాయి దుర్గ తేజ్‌గా పేరు మార్చుకొన్న ఆయనకు వాహనాలు, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఆయన వోల్వో ఎక్స్‌సీ 90, టయోటా ఫార్చునర్, బీఎండబ్ల్యూ ఎం3 వాహనాలు ఆయన వద్ద ఉన్నాయి. యాక్సిడెంట్ తర్వాత బైక్స్‌కు దూరంగా ఉంటున్నారు. దాదాపు బైక్స్ అన్నీ అమ్మివేసినట్టు తెలిసింది.

HBD Sai Durga Tej Sai Dharam Tej net Worth and Remuneration details on Happy His birthday

జాతీయ మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం.. సాయిధరమ్ తేజ్ నికర ఆస్తుల విలువ సుమారుగా 100 నుంచి 150 కోట్ల మధ్య ఉంటుంది. ఆయన ప్రతీ సినిమాకు 8 నుంచి 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొంటారనేది సమాచారం. త్వరలోనే ఆయన హనుమాన్ నిర్మాత రూపొందించే భారీ బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X