టాలీవుడ్ లో హిట్ ఫార్ములా.. హీరోలకు ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
ఇప్పుడు ఒక్క ఇండియా వైడ్ గా మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా తెలుగు సినిమాలు ఏ రేంజ్ లో రాణిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాలిన పని లేదు. కాగా ఇలా తెలుగు సినిమాలో వచ్చిన వస్తున్న చాలా చిత్రాలు భారీ వసూళ్లు అందుకోవడమే కాకుండా మంచి పేరు కూడా అందుకుంటున్నాయి. మరి ఈ సినిమాల్లో ఇటీవల కాలంలో చూసినట్టు అయితే కొన్ని కామన్ పాయింట్స్ దగ్గరగా కనిపిస్తున్నాయని చెప్పాలి.
అయితే ఇపుడు నడుస్తున్న భారీ సినిమాల ట్రెండ్ లో హీరోలకి అనే కాకుండా ఇతర నటీనటులకు కూడా వారి నటన చూపించే రేంజ్ సినిమాలు పడట్లేదు అనే టాక్ ఉంది. కానీ కొందరు దర్శకులు మాత్రం అన్ని హై మూమెంట్స్ తో పాటుగా హీరోలని నటులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా అలా మన హీరోలు స్టన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చిన పాత్రల్లో గమనిస్తే వారిలో ఏదొక లోపం కనిపిస్తుంది అని చెప్పాలి.

అయితే కళ్ళు లేకపోవడమో లేక వినపడకపోవడం ఇంకా ఇలా ఇతరత్రా అంశాలు ఉన్నాయి. కాగా ఆ కొన్ని సినిమాలు చూసుకుంటే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా రంగస్థలం చూసుకోవచ్చు. ఇందులో చరణ్ చెవిటి వానిగా కనిపించి సర్ప్రైజ్ చేసాడు. తన పెర్ఫామెన్స్ కి చప్పట్లు పడ్డాయి. ఇక దీని తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాల్లో భుజం పైకెత్తుకుని తనకి కూడా లోపం ఉన్నట్టుగా అద్భుతంగా నటిస్తే తనకి జాతీయ అవార్డు వచ్చింది.
ఇంకా వాల్తేరు వీరయ్యలో చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవికి ఎత్తయిన ప్రదేశాలు చూస్తే ఎంతో భయపడతారు. వీటితో పాటుగా మాస్ మహారాజా రవితేజ రాజా ది గ్రేట్ సినిమాలో అంధుని పాత్రలో నటించారు. అయితే ఈ అన్ని సినిమాల్లో హీరోలకి ఏదొక లోపం ఉంటుంది. కట్ చేస్తే ఈ సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచినవే.
కానీ లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మళ్ళీ వచ్చాడని చెప్పాలి. తాను నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్ లో మొదటి నుంచీ అప్పన్న పాత్ర ఎంతో కీలకంగా హైప్ చేశారు. మరి ఊహించని విధంగా రామ్ చరణ్ ఆ రోల్ లో అందరికీ షాకిచ్చాడు. ఇంట్రెస్టింగ్ గా ఈ పాత్రకి నత్తి ఉంటుంది. మరి ఇలాంటి పాత్రని కూడా రామ్ చరణ్ అద్భుతంగా చేసేసరికి చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
తన పెర్ఫామెన్స్ కి రంగస్థలం లో చిట్టి బాబు తర్వాత ఇపుడు మళ్ళీ ఈ సినిమాకి యూనానిమస్ రెస్పాన్స్ వస్తుంది. దీనితో మన తెలుగు సినిమాల్లో దాదాపు స్టార్స్ హిట్స్ కొట్టాలి అంటే యిలా వారికి ఏదొక లోపం ఉండే ఫార్ములా సెట్ చేసుకొనే రావాలి అన్నట్టు ఉంది. మరి ఇక ముందు ఎన్ని సినిమాలు ఈ తరహా ప్లాట్ తో వస్తాయో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











