India Vs Pak పాకిస్థాన్‌పై చెలరేగిన విరాట్ కోహ్లీ.. అద్బుత సెంచరీ చేసిన భర్తపై అనుష్క పెట్టిన పోస్టు వైరల్
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్స్ వీరవిహారం చేశారు. క్రికెట్ అభిమానుల్లో కొండంత జోష్‌ను నింపుతూ భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ పారించిన పరుగుల వరదకు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. విరాట్ కోహ్లీ చెలరేగి ఆడిన తీరుపై క్రికెట్ అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. అయితే విరాట్ కొట్టిన సెంచరీపై ఆయన భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మ సోషల్ మీడియాలో చేసిన కామెంట్ వైరల్ అయింది. విరాట్ ఆట తీరు, అనుష్క శెట్టి చేసిన పోస్టు వివరాల్లోకి వెళితే..
పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోవడం తెలిసిందే. వర్షం అడ్డంకిగా నిలిచిన సమయంలో భారత్ 24.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఆట నిలిచిపోయే సమయానికి విరాట్ కోహ్లీ 8 పరుగులతోను, కేఎల్ రాహుల్ 17 పరుగలతో క్రీజులు ఉన్నారుు. నిన్నటి స్కోరుతో ఆటను ప్రారంభించిన విరాట్, రాహుల్ చెలరేగిపోయారు.

విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరు కలిసి ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరుగులు పెట్టించారు. కోహ్లీ 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 122 పరుగులు చేశాడు. కొలంబో క్రికెట్ మైదానంలో గత నాలుగు ఇన్సింగ్స్‌లో విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు చేయడం గమనార్హం. గతంలో 116 బంతుల్లో 110 పరుగులు, 96 బంతుల్లో 131 పరుగులు, 119 బంతుల్లో 128 పరులుగు చేయడం తెలిసిందే.
వన్డేలో అత్యధిక పరులుగు సాధించిన క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ నిలిచారు. విరాట్ కోహ్లీ వేగంగా 13 వేల పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ 267 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధిస్తే.. సచిన్ టెండూల్కర్ 321 ఇన్నింగ్స్‌లో, రికీ పాంటింగ్ 341 ఇన్నింగ్స్‌లో, కుమార సంగక్కర 363, సనత్ జయసూర్య 416 ఇన్నింగ్స్‌లో సాధించారు.

పాకిస్థాన్‌పై అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీపై ఆయన సతీమణి అనుష్క శర్మ ప్రశంసలతో ముంచెత్తింది. తన ఇన్స్‌టాగ్రామ్ హ్యాండిల్‌లో విరాట్ సాధించిన సెంచరీపై కామెంట్ చేసింది. సూపర్ ఇన్నింగ్స్ ఆడావు.. సూపర్ గయ్ (Super Knock, Super Guy)అంటూ విరాట్ సెంచరీ కొట్టగానే ఆనందంతో ఆకాశం వైపు చూస్తూ అభివాదం చేస్తున్న ఫోటోను షేర్ చేసింది.

అలాగే విరాట్ కోహ్లీతోపాటు సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్‌కు అనుష్క శర్మ విషెస్ తెలియజేసింది. కంగ్రాట్స్ రాహుల్ల అంటూ 100 పరుగులు చేసిందుకు అభినందించింది. ఇన్స్‌టాగ్రామ్ స్టాటస్‌లో అనుష్క శర్మ పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. కిక్రెట్ అభిమానులను, సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకొన్నాయి.


Click it and Unblock the Notifications











