వారితో ఎలాంటి లింక్స్ లేవు.. దయచేసి అలా ప్రచారం చేయకండని వేడుకున్న పూర్ణ
గత రెండు మూడు రోజులుగా అవును ఫేమ్ పూర్ణ హీరోయిన్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఆమె కొంతమంది దుండగులు మోసం చేశారని, డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నారని, లేదా ప్రాణాలు తీస్తామని బెదిరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే హీరోయిన్ పూర్ణ వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా వారందర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే ఈ ఘటనపై మీడియాలో వస్తున్న వార్తలపై పూర్ణ మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు మీడియాను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ చేసింది.

అదీ జరిగింది..
బంధువుల స్నేహితుల ద్వారా అన్వర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడని, పెళ్లి సంబంధాల పేరుతో తమకు దగ్గరయ్యారని, ఫోన్ ద్వారానే తమ కుటుంబానికీ పరిచయమయ్యారని తెలిపింది. అయితే ఎప్పుడూ కూడా వీడియో కాల్ మాట్లాడటానికి మాత్రం ఒప్పుకోలేదని, ఓసారి ఇంటికి వచ్చి వెళ్లారని, అప్పుడే అనుమానం మొదలైందని పేర్కొంది. ఆపై వారు బెదిరించడం, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పూర్ణ పోలీసులను సంప్రదించింది.

లింక్ పెట్టి రాయోద్దు..
'ఈ ఇబ్బందికర సమయంలో నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. నా కేసుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలను రాశాయి. వీటిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఈ బ్లాక్ మెయిల్ కేసులోని నిందితుడితో కానీ ఆ ముఠాతో కానీ నాకు ఎలాంటి లింక్ లేదు. నిందితుడితో లింక్ పెట్టి తప్పుడు వార్తలను రాయొద్దని మీడియాను కోరుతున్నాను.

వారి ఉద్దేశ్యం తెలియదు..
తప్పుడు పేర్లు, తప్పుడు చిరునామాలలతో పెళ్లి విషయంలో మమ్మల్ని మోసం చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని మా కుటుంబం నిర్ణయించింది. తాము పోలీసులకు ఫిర్యాదు చేయబోతుండటంతో... వారు బ్లాక్ మెయిలింగ్ కు దిగారు. మాకు ఇప్పటికీ వారి ఉద్దేశ్యం ఏంటో తెలియదు.
Recommended Video

మిగతా వారు మేల్కోవాలి..
తమ ఫిర్యాదుపై కేరళ పోలీసులు అద్భుతంగా స్పందించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ పూర్తయ్యేంత వరకు ఎలాంటి అవాస్తవాలను ప్రచురించవద్దని మీడియాను కోరుతున్నా. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కేసు విచారణ పూర్తైన తర్వాత మీడియాను కలుస్తాను. నా జీవితంలో ఎదురైన ఇలాంటి చేదు ఘటనకు నాకు మద్దతు ఇచ్చినందుకు ఫ్రెండ్స్, ఫ్యాన్స్ అందరికీ మరోసారి థ్యాంక్స్ చెబుతున్నా. నాకు జరిగిన ఈ ఘటన ద్వారా మిగతా సోదరిమణులు మేల్కొంటారని, జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నా'ని పూర్ణ తెలిపింది.


Click it and Unblock the Notifications











