గత పదేళ్లలో తొలిసారి అలాంటి అనుభవం.. హీరోయిన్ పూర్ణ సెన్సేషన్ కామెంట్స్

అవును, సీమటపాకాయ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అందాల భామ పూర్ణ. పూర్ణ అసలు పేరు షామ్నాకాశిం. ఆమె పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కేరళలోనే. ఈ కేరళ కుట్టి 2007 లో వచ్చిన శ్రీ మహాలక్ష్మితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆపై అవును చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. తమిళ, మళయాలంలో మంచి పాత్రలను పోషించి అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అయితే గత కొన్ని రోజులుగా పూర్ణ వార్తల్లో నిలుస్తోంది. డబ్బులివ్వాలని కొందరు తనను బెదిరిస్తున్నారని, చంపుతామని ఫోన్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అన్ని ఇండస్ట్రీల్లో బాగా వైరల్ అయింది.

 పూర్ణకు బెదిరింపులు..

పూర్ణకు బెదిరింపులు..

లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాకుండా బ్లాక్ బెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పూర్ణ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సోషల్ మీడియా ద్వారా వీరు దగ్గరయ్యారని, పెళ్లి సంబంధం పేరుతో ఇంటికి కూడా వెళ్లారని తెలుస్తోంది. ఈ మేరకు పూర్ణ కొన్ని విషయాలను వెల్లడించింది.

అలా మొదలైంది..

అలా మొదలైంది..

బంధువుల స్నేహితుల ద్వారా అన్వర్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడని చెప్పింది. ఫోన్‌ ద్వారా తమ కుటుంబానికి పరిచయం చేసినట్లు తెలిపింది. అలా వారు ఇటీవల తమ ఇంటికి వచ్చారని చెప్పింది. వారిని ప్రత్యక్షంగా చూడడంతో తమకు అనుమానం కలిగిందని తెలిపింది.

డబ్బులివ్వాలని..

డబ్బులివ్వాలని..

వివరాలను అడగ్గా బదులు చెప్పకుండా వెళ్లిపోయారని తెలిపింది. ఆ తర్వాత ఫోన్‌ చేసి డిమాండ్‌ చేశారని చెప్పింది.తాము వారు అడిగిన డబ్బు ఇవ్వనడంతో బెదిరించారని, ఇంటి నుంచి బయటికి వస్తావుగా అప్పుడు చెప్తా నీ పని అని బెదిరించారని తెలిపింది. రంగస్థలం వేదికపై పాల్గొనడానికి వస్తావుగా అంటూ బెదిరించారని చెప్పింది. పదేళ్లకు పైగా ఉన్న ఈ ఇండస్ట్రీలో ఇలాంటి అనుభవం ఎదురవడం ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చింది.

అవకాశాల కోసం అలా..

అవకాశాల కోసం అలా..

అలా వారు బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. పోలీసులు వారిని అరెస్ట్‌ చేసినట్లు పేర్కొంది. అంతకు ముందే వారు పలువురు అమ్మాయిలు మోసపోయినట్లు తెలిసిందని, ఇప్పుడు వారి బండారం బయటపడిందని చెప్పింది. రంగుల ప్రపంచమైన సినిమా రంగంలోకి అవకాశాల కోసం పలువురు యువతులు వస్తున్నారని, వారంతా హోటల్లో బస చేస్తూ అవకాశాల వేటలో పడుతున్నారని చెప్పింది.

Recommended Video

Rumours On Star Hero Arya Wife Sayyeshaa Saigal
నేనూ మోసపోయాను..

నేనూ మోసపోయాను..

కొత్తగా అవకాశాల కోసం వచ్చే నటీమణులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. తాను కూడా అలా ఒక వ్యక్తి చేతిలో మోసపోయానని చెప్పింది. అవకాశాల పేరుతో మోసాలకు దిగే వారితో జాగ్రత్తగా ఉండాలని పూర్ణ హెచ్చరించింది. అవకాశాలను కల్పిస్తామని వచ్చే వారి గురించి తమకు తెలిసిన వారితోగానీ, స్నేహితులతోగానీ చర్చించి మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X