ప్రియమణి ఇంట సంబరాలు.. ఎందుకో మీరే చుడండి

సౌత్ సినిమాల్లో ప్రియమణికి, ఆమె అందానికి ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఆమె చేసిన సినిమాలు, చూపిన అభినయం అలాంటిది. అయితే ముస్లిం యువకుడిని పెళ్లాడిన ప్రియమణి ఆ తరువాత సినిమాకు కాస్త దూరంగా ఉంది. కాకపోతే అవకాశం ఉన్నప్పుడల్లా అభిమానులకు టచ్ లోకి వస్తోంది ఈ ముద్దుగుమ్మ. కాగా ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో తన ఇంట్లో సంబరాలు, విశేషాల గురించి చెప్పింది ప్రియమణి.

మతానికి అతీతంగా ముస్తఫా అనే ముస్లిం యువకుడిని పెళ్లాడింది ప్రియమణి. అయితే ఈ ఇద్దరివీ వేరు వేరు మతాలైనప్పటికీ ఒకరి మతం పట్ల మరొకరు పాజిటివ్ గా ఉంటూ జీవనం సాగిస్తుంటారట. ఈ నేపథ్యంలో ముస్లిం పెద్ద పండుగ రంజాన్ సందర్బంగా తన భర్త, తాను ఎలా పండుగ సెలెబ్రేట్ చేసుకుంటున్నామనే విశేషాలు చెప్పుకొచ్చింది ప్రియమణి.

Heroine Priyamani celebrate Ramadan with her husband

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ''రంజాన్ మాసంలో ముస్తఫా తప్పకుండా ఉపవాసం ఉంటారు. ఉదయాన్నే లేచి నమాజ్ చేసి తిరిగి ఉపవాస దీక్ష చేపడతారు. రోజు సాయంత్రం ముస్లిం కమ్యూనిటీ హాల్ కు వెళ్లి ఉపవాస దీక్ష విరమించి వస్తుంటారు. ఉపవాస దీక్ష చేయడం చాలా కష్టమైన పని. ఉపవాసం మొదలుపెట్టె ముందు ప్రతీ ఒక్కరూ సంకల్పం చెప్తారు. అయితే సంకల్పం చెప్పేముందు ఉపవాసం చేయలేము కావచ్చు అనే అనుమానం వస్తే ఆ రోజు ఉపవాసం మానేయొచ్చు కానీ.. ఒకసారి సంకల్పం చెప్పాక ఉపవాసం మానడానికి వీలు ఉండదు.

ఈ అచారాలన్నీ మా ఆయన ముస్తఫా తూచా తప్పకుండా పాటిస్తారు'' అని చెబుతోంది ప్రియమణి. అంతేకాదు తన భర్త మతం పట్ల అభిమానంతో రంజాన్ మాసంలో ఎక్కువ మొత్తంలో దానధర్మాలు చేస్తుందట ప్రియమణి. తన మతం కాకపోయినా రంజాన్ పట్ల ప్రియమణికి గౌరవం అభినందించదగిన విషయమే కదండీ!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X