7000 కోట్ల లగ్జరీ క్రూయిజ్ పార్టీ.. అనంత్ అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలో మైండ్ బ్లాంక్ అయ్యే విశేషాలు ఇవే
ఆసియా దిగ్గజ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్, కోడలు రాధికల రెండవ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ అత్యంత గ్రాండ్ గా జరగబోతోంది. మరి ఈ వేడుకకు హాజరు కాబోతున్న సినీ సెలబ్రిటీలు ఎవరు? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల రెండవ ప్రీ వెడ్డింగ్ వేడుక మే 28 నుండి ఇటలీలో ప్రారంభమవుతుంది. మే 28న ఘనంగా స్వాగత కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇది పెళ్లికి ముందు జరిగే గ్రాండ్ అండ్ మరిచిపోలేని ఫంక్షన్ అని అంటున్నారు. రాధిక-అనంత్‌ల మొదటి ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు రెండో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కూడా మరింత ఉత్సాహంగా జరపబోతున్నారు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా అనంత్ - రాధిక ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ గురించే చర్చ జరుగుతోంది. అనంత్ అంబానీ రెండో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ రూ.7000 కోట్ల లగ్జరీ క్రూయిజ్‌లో జరగనుంది. అంతేకాదు 800 మంది వీవీఐపీ అతిథులు ఈ ఫంక్షన్‌లో చేరే అవకాశం ఉంది. ప్రీ వెడ్డింగ్ పార్టీకి పలువురు జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలు హాజరవుతారని సమాచారం.
సమాచారం ప్రకారం అంతర్జాతీయ స్టార్ షకీరా కూడా అనంత్ అంబానీ రెండవ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌కు హాజరు కావచ్చు. రాధిక-అనంత్ ల రెండో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ క్రూయిజ్ ఇటలీ, ఫ్రాన్స్ మధ్య 4,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించనుంది. ఈసారి అతిథులు సముద్రపు స్వచ్ఛమైన అందాల మధ్య పార్టీని జీవితంలో మరిచిపోలేని విధంగా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు.
అంబానీ కుటుంబానికి చెందిన అతిథి జాబితాలో 800 మంది ఉన్నారు. ఇందులో బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ ప్రముఖులు ఉంటారు. బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అలియా భట్ ఈ వేడుకలో పాలు పంచుకొనున్నారు. కానీ టాలీవుడ్ స్టార్స్ మాత్రం అంబానీ ఫ్యామిలీ నుంచి ఆహ్వానం అందలేదు.
కాగా క్రూయిజ్‌లో 600 కంటే ఎక్కువ మంది ఉద్యోగులె ఉండడం విశేషం. క్రూయిజ్ ధర 7 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. జామ్‌నగర్‌లో జరిగిన మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకకు అంబానీ కుటుంబం రూ.1,259 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు ఈ పార్టీకి అంతకంటే పది రెట్లు ఖర్చు పెడుతున్నారు.
మొదటి సారి జరిగిన అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా వెళ్లలేదు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం తన భార్యతో కలిసి వెళ్ళాడు. మరి ఈసారి కూడా ఈ మెగా దంపతులు సెలబ్రేషన్స్ లో పాల్గొంటారా? అనే విషయంపై క్లారిటీ లేదు.


Click it and Unblock the Notifications











