అంబానీ పెళ్లిలో అదరగొట్టిన మహేష్.. రజనీకాంత్, ధోని.. ఇంకా ఎవరెవరూ వచ్చారంటే?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి అన్ని భాషల సినిమా నటులు, సూపర్ స్టార్స్ ముంబైకి తరలివచ్చారు. కేవలం సినీ తారలే కాకుండా ప్రపంచాధినేతలు, క్రీడాకారులు, హాలీవుడ్ నటులు ఈ వేడుకలో భాగమయ్యారు. ఈ వేడుకలో విశేషాలు, హైలెట్ విషయాల్లోకి వెళితే..
తెలుగు, దక్షిణాది నుంచి భారీగా తారలు ఈ పెళ్లికి హాజరయ్యారు. ముంబైలో జరిగిన వివాహ కార్యక్రమంలో మహేష్ బాబు, సితార, నమత్ర పాల్గొన్నారు. ఇంకా వెంకటేష్, రానా దగ్గుబాటి, మిహిక, అఖిల్ అక్కినేని తదితరులు హాజరయ్యారు. దక్షిణాది నుంచి నయనతార, విఘ్నేష్, రజనీకాంత్, ఐశ్వర్య రజనీకాంత్, సూర్య, జ్యోతిక తదితరుల తరలి వచ్చారు.

ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో, షారుక్ ఖాన్ తన సతీమణితో, రణ్ బీర్ కపూర్, రణ్ వీర్ కపూర్, అనన్యపాండే, అనిల్ కపూర్ తదితరులు హాజరయ్యారు. ప్రియాంక చోప్రా డ్యాన్సులతో హోరెత్తించారు. అనన్య పాండే కూడా డ్యాన్స్ వేసి ఆకట్టుకొన్నారు. షారుక్ ఖాన్ పఠాన్ సినిమా పాటలపై స్టెప్పులేసి అందరిలో జోష్ పెంచారు.

ఇక రజనీకాంత్ తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేయగా.. ఆయనతోపాటు అనిల్ కపూర్ కూడా డ్యాన్స్ చేశారు. వీరంతా అనంత్ అంబానీతో కలిసి స్టెప్పులు వేయడం విశేషంగామారింది. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఆటతో ఆకట్టుకొన్నారు. కత్రినా కైఫ్ ఎరుపు రంగు చీరలో అందర్నీ ఆకట్టుకొన్నారు.

క్రికెటర్లు హార్దిక్ పాండ్యా తన మిస్టరీ గర్ల్ ఫ్రెండ్ నటాషాతో కలిసి వచ్చారు. ధోని తన భార్య, కూతురుతో కలిసి పెళ్లికి హాజరయ్యారు. ఇదిలా ఉండగా హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్, కోల్ కర్దాషియాన్ ఇద్దరు ఆటలో తిరిగి ఆకట్టుకొన్నారు. పెళ్లిలో రెడ్ లంగాలో కనిపించి షాకిచ్చారు. జాన్ సేనా తనదైన స్టయిల్‌లో ఆకట్టుకొన్నారు.

వరుణ్ ధావన్, కృతిసనన్, ఆనిల్ కపూర్.. గోవిందా నటించిన సినిమాలోని మై రస్తేపే జా రహాతా అనే పాటపై స్టెప్పులేశారు. దిశాపటానీ, ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్,లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు.


Click it and Unblock the Notifications











