Oscars Awards కోసం నామినేట్ అయిన భారతీయ సినిమాలు? ఏ సినిమాకు అవార్డులు దక్కాయంటే?

సినిమా రంగంలో నోబెల్ బహుమతిగా భావించే ఆస్కార్ అవార్డుల్లో భారతీయ సినిమాలు అప్పుడప్పుడు మెరుపులు మెరిపించడం తప్పితే.. పెద్దగా అవార్డులు సంపాదించింది లేదు. గత 80 ఏళ్లకుపైగా సినిమా చరిత్రలో అతికొద్ది సినిమాలు మాత్రమే ఆస్కార్‌లో తమ సత్తాను చాటే ప్రయత్నం చేశాయి. అయితే 1958 నుంచి ఆస్కార్ అవార్డుల వేడుకల్లో ఎన్ని సినిమాలు నామినేట్ అయ్యాయి.. ఎన్ని చిత్రాలు అవార్డులు సంపాదించాయనే వివరాల్లోకి వెళితే..

తొలిసారి 1958లో మదర్ ఇండియాకు

తొలిసారి 1958లో మదర్ ఇండియాకు


భారతీయ సినిమా చరిత్రలో 1958 సంవత్సరంలో తొలిసారి మదర్ ఇండియా అనే సినిమా ఆస్కార్ అవార్డుల్లో తొలి నామినేషన్‌ను సంపాదించింది. మెహబూబ్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సునీల్ దత్, రాజేంద్ర కుమార్, రాజ్ కుమార్‌తోపాటు నర్గీస్ దత్ నటించారు. అయితే నామినేషన్‌కు మాత్రమే మదర్ ఇండియా పరిమితమైంది. ఆ తర్వాత 1961లో ది క్రియేషన్ ఆఫ్ ఉమెన్ అనే షార్ట్ డాక్యుమెంటరీకి ఇస్మాయిల్ మర్చంట్ సినిమా నామినేట్ అయ్యారు కానీ.. అవార్డు సంపాదించలేదు.

 గాంధీ సినిమాకు తొలి అవార్డు

గాంధీ సినిమాకు తొలి అవార్డు


ఇక 1969లో ది హౌస్ దట్ ఆనంద బ్యూల్ట్ అనే షార్ట్ డాక్యుమెంటరీకి ఫాలీ బిలిమోరియా నామినేట్ అయ్యారు. కానీ అవాదర్డు దక్కలేదు. ఆ తర్వాత 1978లో బెస్ట్ యానిమేషన్ క్యాటగిరిలో బీడ్ గేమ్ అనే సినిమాకు ఇషు పటేల్‌ నామినేట్ అయ్యారు. కానీ ఆస్కార్ దక్కలేదు. అనంతరం యాన్ ఎన్‌కౌంటర్ విత్ ఫేసెస్ అనే షార్ట్ డాక్యుమెంటరీకి కేకే కపిల్ నామినేట్ అయ్యారు. అప్పుడు అవార్డుల్లో నిరాశే ఎదురైంది. ఇక 1983లో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకొన్న గాంధీ చిత్రం మరోసారి ఆస్కార్ అవార్డుల్లో నామినేట్ అయింది. మహాత్మాగాంధీ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని రిచర్డ్ అటెన్ బరో నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోసం బెస్ట్ క్యాస్టూమ్ డిజైన్ క్యాటగిరిలో భాను అతయా, బెస్ట్ మ్యూజిక్ క్యాటగిరిలో రవి శంకర్ పండిట్ నామినేట్ అయ్యారు. కానీ భాను అతయా మాత్రమే తొలిసారి ఈ అవార్డును సాధించింది.

 ఆస్కార్ రేసులో సలాం బాంబే

ఆస్కార్ రేసులో సలాం బాంబే


అలాగే 1987లో ఏ రూమ్ విత్ ఏ వ్యూ అనే చిత్రం బెస్ట్ మూవీ క్యాటగిరిలో ఇస్మాయిల్ మర్చంట్ నామినేట్ అయ్యారు. ఆ తర్వాత 1989లో మీరా నాయర్ దర్శకత్వం వహించి నిర్మించిన సలామ్ బాంబే చిత్రం ఉత్తమ విదేశీ భాష క్యాటగిరిలో నామినేట్ అయ్యింది. ఆ తర్వాత 1993లో ఇస్మాయిల్ మర్చంట్ రూపొందించిన హోవార్డ్స్ ఎండ్, ది రిమైన్స్ ఆఫ్ ది డే చిత్రాలు బెస్ట్ మూవీ క్యాటగిరిలో నామినేట్ అయ్యాయి. కానీ అవార్డులు దక్కలేదు.

 ఆస్కార్ కోసం లగాన్ వీర పోరాటం

ఆస్కార్ కోసం లగాన్ వీర పోరాటం


ఆస్కార్ అవార్డులు 2002 సంవత్సరంలో మరోసారి భారతీయ సినిమా ఆశలు చిగురింప చేసింది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో రూపొందిన అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రం ఉత్తమ విదేశీ భాష క్యాటగిరిలో నామినేట్ అయింది. దాదాపు అవార్డు ఖాయమనే భ్రమను కల్పించింది. కానీ చివరకు ఆస్కార్‌లో నిరాశే ఎదురైంది. 2005లో లిటిల్ టెర్రిరిస్ట్ అనే సినిమాకు అశ్వీన్ కుమార్ నామినేట్ అయ్యారు.

 అవార్డుల పంట పండించిన స్లమ్ డాగ్ మిలియనీర్

అవార్డుల పంట పండించిన స్లమ్ డాగ్ మిలియనీర్

ఇక 2009లో భారతీయ సినీ కళాకారులు ఆస్కార్ పంట పడించారు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు బెస్ట్ సౌండ్ డిజైన్ క్యాటగిరిలో రసూల్ పోకుట్టి, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో రచయిత గుల్జార్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఏఆర్ రెహ్మాన్ నామినేట్ అవ్వడమే కాకుండా అవార్డులు కూడా సాధించడం భారతీయ సినిమా చరిత్రను తిరిగరాసింది. 2011లో మరోసారి 127 హావర్స్ అనే సినిమాకు ఏఆర్ రెహ్మాన్ నామినేట్ అయ్యారు కానీ అవార్డు దక్కలేదు.

లైఫ్ ఆఫ్ పై సినిమా నామినేషన్‌లో

లైఫ్ ఆఫ్ పై సినిమా నామినేషన్‌లో


ఆస్కారు అవార్డుల్లో 2013లో లైఫ్ ఆఫ్ పై అనే సినిమాకు బాంబే జయశ్రీ రాసిన పాట బెస్ట్ సాంగ్ క్యాటగిరిలో నామినేట్ అయింది. 2019లో పిరియడ్. ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ అనే సినిమా బెస్ట్ డాక్యుమెంటరీ క్యాటగిరిలో గునీత్ మోంగా నామినేట్ అయి అవార్డును దక్కించుకొన్నారు. 2022లో రింతూ థామస్, సుస్మిత్ ఘోష్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ క్యాటగిరిలో రైటింగ్ విత్ ఫైర్ అనే సినిమాకు, శౌనాక్ సేన్, ఆమన్ మన్ బెస్ట్ డాక్యుమెంటరీ క్యాటగిరిలో నామినేట్ అయ్యారు. కానీ అవార్డుల సాధించలేకపోయారు.

ఆస్కార్‌లో సత్తా చాటిన RRR

ఆస్కార్‌లో సత్తా చాటిన RRR


2023 సంవత్సరం అంటే ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల సంబరాల్లో భారత్ మరోసారి సత్తా చాటింది. ది ఎలిఫాంట్ విష్పరర్ సినిమా బెస్ట్ షార్ట్ ఫిలిం డాక్యుమెంటరీ క్యాటగిరిలో కార్తికి గోనసాల్వెస్, గునీత్ మోంగా నామినేట్ అయ్యారు. అలాగే RRR సినిమా కోసం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఎంఎం కీరవాణి, చంద్రబోస్ నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన నలుగురు కూడా ఆస్కార్ అవార్డులు సాధించడంతో భారత్ మరోసారి చరిత్ర సృష్టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X