సమంత విడాకుల తర్వాత.. నాగార్జున ఆస్తుల విలువ పడిపోయిందా? అక్కినేని హీరోల సంపద ఎన్ని కోట్లంటే?
శోభితా ధూళిపాల, నాగచైతన్య నిశ్చితార్థం తర్వాత అక్కినేని కుటుంబ వ్యవహారాలపై సోషల్ మీడియాలోను, జాతీయ మీడియాలోను రకరకాల ఊహాగానాలు కథనాల రూపంలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజా సంఘటనతో సమంతను జోడించి రాస్తున్న కథనాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అయితే సమంత డైవోర్స్ తర్వాత.. శోభితా అక్కినేని ఫ్యామిలీలో చేరిన తర్వాత నాగార్జున ఆస్తుల వివరాలు ఇవే అంటూ జాతీయ మీడియా కథనాలను వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే..
అక్కినేని హీరోల నికర ఆస్తుల వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్‌లో స్థిరపడటానికి అఖిల్ ప్రయత్నిస్తున్నారు. 2015లో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆయనకు 2021 సంవత్సరంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా ద్వారా హిట్ కొట్టాడు. అఖిల్ అక్కినేని ఆస్తుల విలువను 60 కోట్లుగా అంచనా కట్టారు.

ఇక నాగచైతన్య ఆస్తుల వివరాలకు వస్తే.. తాతల నుంచి అంటే దగ్గుబాటి, అక్కినేని కుటుంబాల నుంచి సంక్రమించిన ఆస్తులతోపాటు తాను ప్రొఫెషనల్‌గా సంపాదించిన ఆస్తులు భారీగానే ఉన్నాయి. గత మూడేళ్లలో భారీగా వృద్దిని సాధించాయి. తండేల్‌లో నటిస్తున్న ఆయన సుమారుగా 10 కోట్ల రూపాయల మేర రెమ్యునరేషన్ తీసుకొంటారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 170 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఇక అక్కినేని నాగార్జున ఆస్తుల విలువ భారీగానే అనే కంటే కళ్లు చెదిరేలా ుంది. అన్నపూర్ణ స్టూడియో, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వారసత్వపు ఆస్తులు భారీగా ఉన్నాయి. ఆయన ఆస్తుల విలువను 3500 కోట్లుగా అంచనా వేశారు. టాలీవుడ్ హీరోల్లో అత్యధిక సంపద ఉన్న హీరోల్లో ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు.
అయితే నాగార్జున ఆస్తుల విలువలో కొంత తగ్గిందనే విషయాన్ని జాతీయ మీడియా విశ్లేషించింది. సమంత వారి కుటుంబంలో ఉన్న సమయంలో అదనంగా 100 కోట్లు పెరిగింది. ఆమె విడాకులు తీసుకొన్న తర్వాత నాగార్జున ఆదాయం 100 కోట్లు తగ్గిందని పేర్కొన్నది. అయితే శోభితా పెళ్లి తర్వాత ఆయన సంపదలో పెద్ద ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు అని తెలిపింది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో అనేది ప్రశ్నార్థకంగా మారింది.


Click it and Unblock the Notifications











