twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ ప్రియులకు నెట్‌ఫ్లిక్స్ బంపర్ ఆఫర్: ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ పొందేందుకు ఇలా చేయండి!

    |

    సోషల్ మీడియా పుణ్యమా అని ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలను థియేటర్లకు వెళ్లి చూసే వారి సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతోంది. చాలా మంది టికెట్ కొనుక్కుని సినిమా చూసే అలవాటును మార్చుకుంటున్నారు. దీనికి కారణం మార్కెట్‌లో బోలెడు ఓవర్ ద టాప్ (ఓటీటీ) ఫ్లాట్‌ఫామ్స్ ఉండడమే. నెలవారీ చార్జీనే, ఏడాది ప్లాన్‌నో తీసుకుంటే ఎంచక్కా ఇంట్లో కూర్చునే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు సహా బోలెడు వీడియోలు చూసేయొచ్చు. అందుకే ప్రతి ఓటీటీ సంస్థ సరికొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అసలు ఆ ఆఫర్ ఏంటి.? దాన్ని పొందడం ఎలా? అనే వివరాలు మీకోసం!

    కరోనా ప్రభావంతో అంతా వాటివైపే

    కరోనా ప్రభావంతో అంతా వాటివైపే

    కరోనా వైరస్ ప్రభావంతో ఎనిమిది నెలలుగా దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లన్నీ మూతపడిపోయాయి. దీంతో వినోద ప్రియులంతా ఓటీటీ ప్లాట్‌ఫాంల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రతి సంస్థ సరికొత్త కంటెంట్‌ను తీసుకొస్తుంది. డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రాంతీయ భాషల్లో సైతం ఓటీటీ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. దీంతో వాటి ట్రాఫిక్ క్రమంగా పెరుగుతోంది.

     నెట్‌ఫ్లిక్స్ నుంచి అదిరిపోయే ఆఫర్

    నెట్‌ఫ్లిక్స్ నుంచి అదిరిపోయే ఆఫర్

    వినోద ప్రియులు ఓటీటీ సంస్థల వైపు ఇప్పుడిప్పుడే మళ్లుతున్నారు. దీంతో ప్రతీ ప్లాట్‌ఫాం నుంచి ప్రేక్షకులకు నచ్చే కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే అన్ని సంస్థలు ఎన్నో ఆఫర్లను ప్రవేశ పెట్టి వాళ్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించి సంచలనానికి నాంది పలికింది.

     నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్

    నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్

    మిగతా సంస్థల నుంచి వస్తున్న పోటీని తగ్గించుకుని, ప్రేక్షకులను తమ వైపు తిప్పుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ స్ట్రీమ్‌ఫెస్ట్‌ పేరిట రెండు రోజుల పాటు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ ఇవ్వబోతుంది. ఈ ఫెస్ట్‌ సందర్భంగా భారత్‌లో 48(డిసెంబర్‌ 5, 12.01 am నుంచి డిసెంబర్‌ 6, 11.59 pm వరకు) గంటల పాటు ఎవరైనా ఏదైనా సినిమా, సిరీస్‌ లేదా డాక్యుమెంటరీలను ఉచితంగా చూసేయొచ్చు.

    Recommended Video

    Director Shankar Views On Releasing Movies Directly In OTT
     ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ పొందడం ఎలాగంటే

    ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ పొందడం ఎలాగంటే

    నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్‌ఫెస్ట్‌‌ కావాలనుకున్న వారు డిసెంబర్ 5, 6 తేదీల్లో నెట్‌ బ్రౌజర్‌లో Netflix.com/StreamFest అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. అక్కడ ప్రీ సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. లేదా నెట్‌ఫ్లిక్స్ ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మీ ఈమెయిల్‌ ఐడీ లేదా పేరు లేదా ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ అవ్వాలి. ఈ రెండు పద్దతుల్లో నెట్‌ఫ్లిక్స్ ఆఫర్‌ను ఆనందించవచ్చు.

    English summary
    Netflix, Inc. is an American over-the-top content platform and production company headquartered in Los Gatos, California. Netflix was founded in 1997 by Reed Hastings and Marc Randolph in Scotts Valley, California. The company's primary business is a subscription-based streaming service offering online streaming from a library of films and television series.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X