ప్రభాస్ దుస్తులకే కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాత.. క్యాస్టూమ్స్ కోసం కళ్లు చెదిరే బడ్జెట్!

బహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్ భవిష్యత్తులో ఎలాంటి సినిమా చేసినా కూడా 100కోట్లకు తక్కువ ఉండదని చాలా ఈజీగా అర్ధమవుతోంది. లవ్ స్టొరీ తీసినా కూడా బడ్జెట్ అమాంతంగా పెరిగిపోవడం కాయం. ఇక సినిమా విడుదలైతే బాక్సాఫీస్ వద్ద సందడి మామూలుగా ఉండదని చెప్పవచ్చు. ప్రభాస్ తో సినిమా చేయాలని అనుకునే దర్శకులు కూడా పాన్ ఇండియా కాన్సెప్ట్ లతోనే రావాల్సి ఉంటుంది. ఇక రాధేశ్యామ్ కూడా కాస్ట్లీ మూవీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

 టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్

టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్


ప్రస్తుతం ప్రబాస్ లైనప్ ఫ్యూచర్ కెరీర్ కు మరో మేజర్ ప్లస్ పాయింట్ లా మరనుందని చెప్పవచ్చు. ఒక్క ఏడాది గ్యాప్ రావడంతో వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. ముందుగా రాధేశ్యామ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

అందరి చూపు ప్రభాస్ వైపే..

అందరి చూపు ప్రభాస్ వైపే..

బాహుబలి, సాహో వంటి హై వోల్టేజ్ యాక్షన్ సినిమాల అనంతరం ప్రభాస్ చేస్తున్న రొమాంటిక్ మూవీ రాధేశ్యామ్. ఈ సినిమా పిరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు రాధాకృష్ణ అందమైన ప్రేమను చూపించబోతున్నట్లు టీజర్ తోనే చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. అయితే అందరి చూపు ఎక్కువగా ప్రభాస్ కాస్ట్యూమ్ పైనే పడింది.

ప్రభాస్ ప్రాణ స్నేహితుడితోనే..

ప్రభాస్ ప్రాణ స్నేహితుడితోనే..

ప్రభాస్ సినిమాలకు చాలా వరకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసేది అతని ప్రాణ స్నేహితుడు భాస్కర్. భాస్కర్ ఏక్ నిరంజన్ సినిమా నుంచి తన స్నేహితుడితోనే కాస్ట్యూమ్స్ రెడీ చేయించుకుంటున్నాడు. అయితే రాధేశ్యామ్ కు కూడా భాస్కర్ స్పెషల్ గా వింటేజ్ స్టైల్ లుక్ లో డ్రెస్సులను రెడీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఏడెనిమిది నెలలు రీసెర్చ్ కూడా చేశారట.

 ప్రభాస్ కోసమే 6కోట్లు

ప్రభాస్ కోసమే 6కోట్లు

ఒక కాలంలో వేసుకున్న డ్రెస్సులు ఎక్కడా దొరకవు. అందుకే వాటిని ప్రత్యేకంగా కుట్టిస్తున్నారట. ఫ్రేమ్ లో కనిపించే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వేసుకునే కాస్ట్యూమ్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయని తెలుస్తోంది. ఇక ప్రభాస్ వేసుకునే కాస్ట్యూమ్ చాలా కాస్ట్లీ అని తెలుస్తోంది. కేవలం ప్రభాస్ డ్రెస్సులను డిజైన్ చేయడానికే దాదాపు 6కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ తో ఒక మినీ సినిమా తీయవచ్చు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను డిజైన్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది.

Recommended Video

Master Movie Closing Box Office Report In Telugu | లాభం ఎంతంటే..
అందుకే ఆలస్యంగా రిలీజ్..

అందుకే ఆలస్యంగా రిలీజ్..

ఇక సినిమాను అనుకున్నట్లుగానే జూలై 30న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ముందుగా సమ్మర్ మిడ్ లో విడుదల చేయాలని ప్లాన్ వేశారు. కానీ అప్పటికే చాలా సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చాయి. పైగా సినిమాకు సంబంధించిన పనులు ఇంకా పూర్తవ్వలేదు. దీంతో జూన్ నెలలో సినిమాను పూర్తి చేసి రెగ్యులర్ ప్రమోషన్స్ అనంతరం జూలై ఎండ్ లో విడుదల చేయడానికి డిసైడ్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X