వీడియో: ఐమాక్స్‌లో సాహో సందడి.. ఆ లైన్ చూస్తే షాక్ కావాల్సిందే!

దేశవ్యాప్తంగా అందరి చూపు ప్రభాస్ హీరోగా రాబోతున్న 'సాహో' పైనే ఉంది. ప్రభాస్ అభిమానులు సహా దేశ జనమంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కేవలం దక్షిణాది లోనే గాక ఉత్తరాదిలోనూ ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొనడం చూసి సాహో స్టామినా ఏంటో అర్థంచేసుకోవచ్చు. ఆగస్టు 30న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రేక్షకులంతా థియేటర్స్ బాట పట్టారు. దీంతో సాహో విడుదలవుతున్న అన్ని థియేటర్స్‌లో సందడి వాతావరణం కనిపిస్తోంది.

ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో టికెట్స్ అన్నీ అమ్ముడైపోవడంతో జనమంతా థియేటర్లకు వెళ్లి టికెట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో థియేటర్ల వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని ఐమాక్స్‌ థియేటర్ వద్ద సాహో కోసం జనం పోటెత్తారు. ఐమాక్స్‌లో మొదలైన టికెట్ లైన్‌ దాదాపు అరకిలోమీటరు మేర ఉండటం గమనార్హం. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.

 Huze Line For Saaho tickets at PrasadsMultiplex

ఇక సాహో వివరాలు చూస్తే.. 350 కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కింది సాహో మూవీ. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో ప్రభాస్ సరసన శ్రద్ద కపూర్ హీరోయిన్‌గా నటించింది. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X