Who is Sudha Reddy? ఎవరీ సుధారెడ్డి? 3000 ఏళ్ల వస్త్ర సంస్కృతితో మెట్ గాలా 2026లో సంచలనం

విచిత్రమైన దుస్తులు ధరించి, విశేషమైన ఆభరణాలు, వింత వింత రూపాలతో ఆకట్టుకొనే ఫ్యాషన్ షో మెట్ గాలా 2026 మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా సినీ తారలు, సినీ ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపారవేత్తలు తమ అలంకారాలతో ఈ వేదికపై ట్రెండ్ క్రియేట్ చేయడం తెలిసిందే. తాజాగా మెట్ గాలా ఈవెంట్‌లో కరణ్ జోహర్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు, సుధారెడ్డి ప్రపంచం చూపును తమ వైపుకు తిప్పుకొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలోను, డిజిటల్ మీడియాలోను సుధారెడ్డి గురించి వెతుకలాట, చర్చ మొదలైంది. వరల్డ్ వైడ్ ప్రభావంతమైన సెలబ్రిటీలను తలదన్నేలా తన మార్క్ చాటుకొన్న సుధారెడ్డి ఎవరనే వివరాల్లోకి వెళితే..

ఎవరీ సుధారెడ్డి అంటే?
తెలంగాణలోని హైదరాబాద్‌‌కు చెందిన ప్రముఖ యువ పారిశ్రామిక వేత్త. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనికుల్లో ఎవరైన మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధినేత పీవీ కృష్ణారెడ్డి సతీమణి. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం వారి సంపద 2.2 బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 20,920 కోట్ల రూపాయలు. ఆమె ప్రస్తుతం మెట్ గాలా ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించారు. తెలంగాణ దుస్తుల సంస్కృతి ప్రపంచానికి చాటిచప్పేలా, తెలంగాణ పక్షి పాలపిట్ట, జమ్మిచెట్టు థీమ్‌తో రూపొందించిన దుస్తులతో హడలగొట్టారు.

Megha Sudha Reddy in Met Gala

మెట్ గాలాలో మూడో సారి
సుధారెడ్డి మెట్ గాలాలో పాల్గొనడం ఇదే తొలిసారి కాదు. గతంలో రెండుసార్లు ఈ వేదికపై తన ప్రతిభను, తన దర్బాన్ని, అభిరుచిని చాటుకొన్నారు. 2021 సంవత్సరంలోను, అలాగే 2024 సంవత్సరంలోను ప్రపంచస్థాయి సెలబ్రిటీలకు ధీటుగా ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ప్రపంచానికి చాటిచెప్పారు. ఈసారి అత్యంత వెలతో కూడిన డ్రస్‌తో అందరి చూపులు తనవైపుకు తిప్పుకోవడంతో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా నిలిచారు.

150 కోట్ల రూపాయల విలువైన నగలతో
హైదరాబాద్‌కు చెందిన బిలియనీర్ సుధారెడ్డి ప్రస్తుత మెట్ గాలాలో ప్రపంచ తారలను కూడా వెనక్కి నెటట్ారు. దాదాపు 15 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో సుమారుగా 150 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగలు ధరించి సెలబ్రిటీలను, అభిమానులను, నిర్వాహకులను నివ్వెరపాటుకు గురిచేశారు. అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ డిజైనర్లు మనీష్ మల్హోత్రా, మేరియల్ హెన్ డిజైన్ రూపొందించిన డ్రస్‌ను ధరించి ఈ పాపులర్ వేదికపై వెలుగులు జిమ్మించారు.

3459 గంటలు.. 3000 సంవత్సరాల నాటి
మెట్ గాలాలో సుధారెడ్డి ధరించిన డ్రస్సులు, ఆభరణాలు తయారీ కోసం మనీష్, మేరియల్ టీమ్‌లు సుమారుగా 3459 గంటల పాటు శ్రమించారు. 90 మంది చేనేత, వివిధ వృత్తులకు సంబంధించిన కళాకారులు పనిచేశారు. 3000 సంవత్సరాల క్రితం నాటి భారతీయ చేనేత కళ మచిలీపట్నం స్టైల్ కళంకారీ దుస్తులను డిజన్ చేశారు. 500 క్యారెట్ల బ్లూ టాంజానైట్ నెక్లేస్, 23 క్యారెట్ల ఎల్లో డైమండ్ రింగ్, రాజస్థాన్ నుంచి తెప్పించిన 30 క్యారెట్ల రోజ్ కట్ పోల్కి డైమండ్ రింగ్‌ను ధరించారు.

హైదరాబాద్ నా ఆస్తిత్వం
హైదరాబాద్ సంస్కృతి నా ఆస్తిత్వం. ఈ ప్రాంతపు కల్చరల్ ఐడెంటిటీని ప్రపంచానికి చాటి చెప్పాలనేది నా కోరిక. గ్గోబల్ ఫ్యాషన్ వేదికకు ప్రాచీన కళంకారీ, కళలను, సంస్కృతులను చాటి చెప్పేందుకు చేసిన ప్రయత్నం. తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసే భాగంగా ఈ వేడుకలో పాల్గొన్నాను అని సుధారెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X