For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు ఇక్కడ చోటు లేదు...వాళ్లను గెంటివేసిన యాంకర్ అనసూయ!

|

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యాంకర్ అనసూయ... అభిమానుల నుంచి ఎదురయ్యే ప్రశంసలు స్వీకరించడం మాత్రమే కాదు, విమర్శలను కూడా అదే స్థాయిలో ధైర్యంగా తిప్పికొడుతుంది. తన పోస్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వారికి తనదైన శైలిలో బుద్ది చెప్పడం ఆమె ప్రత్యేకత.

సంకుచిత మనస్తత్వం గల కొందరు నెటిజన్లు తరచూ అనసూయ ఫోటోలపై, ఆమె చేసే ట్వీట్లపై, వ్యక్త పరిచే అభిప్రాయాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోతుండటం ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైంది. ఇలాంటి వారిని ఉద్దేశించి అనసూయ తాజాగా ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు.

పని లేకుండా తిరిగే వారికంటే మేమ చాలా బెటర్

పని లేకుండా తిరిగే వారికంటే మేమ చాలా బెటర్

మేము నటులం కావడం వల్ల, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కావడం వల్ల... మాకు మా వ్యక్తిగా అభిప్రాయాలు చెప్పే హక్కులేనట్లుగా కొందరు భావిస్తున్నారు. అలాంటి వారు తమ ఆలోచనా విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పని లేకుండా ఖాళీగా తిరిగే వాళ్లకంటే మేము చాలా చాలా బెటర్.... అని అనసూయ వ్యాఖ్యానించారు.

సినిమాలోని అంశాలను నిజ జీవితానికి ఆపాదించ వద్దు

సినిమాలోని అంశాలను నిజ జీవితానికి ఆపాదించ వద్దు

సినిమాలో మేము రకరకాల పాత్రలు చేస్తాం, రకరకాల వేషధారణలో కనిపిస్తాము. అయితే మేము సినిమాలో ప్రవర్తించినట్లుగా, అక్కడ కనిపించినట్లు.... నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాము అనుకోవడం పొరపాటే. మా సినిమా జీవితానికి, నిజ జీవితానికి చాలా తేడా ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి... అని అనసూయ తెలిపారు.

నీచులను నిర్దయగా గెంటివేసిన యాంకర్ అనసూయ!

అనసూయ ఎంత చెప్పిన వినయకుండా కొందరు వితండ వాదం చేస్తూ నీచమైన కామెంట్లతో రెచ్చిపోయారు. దీంతో అనసూయ అందరినీ తన పేజీ నుంచి గెంటివేసింది. ‘వితండ వాదానికి నా అకౌంట్ పేజీలో చోటు లేదు. అందరినీ బ్లాక్ చేస్తున్నాను. ఇది నా అకౌంట్.. నేను ప్రశాంతంగా ఉండటానికి ఏదైనా చేసే హక్కు నాకు ఉంది' అని అనసూయ వ్యాఖ్యానించారు.

అనూయ భరద్వాజ్

అనూయ భరద్వాజ్

అనసూయ భరద్వాజ్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘కథనం' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వురు'లో కీలక పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు యాంకర్‌గా, సినిమా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ చలాకీ యాంకర్ త్వరలో నిర్మాతగా మారి కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసేందుకు సిద్దమవుతోంది.

English summary
"What few here are starting here again that how we don’t have a right to voice our opinions just because we “acted” or are a part of shows/films which are just ways and means of entertainment and nothing more is sheer act of joblessness.. please do realise. Also a heads up!!! Vitanda vaadalaki na account page lo aaskaram ledu🙏🏻🙏🏻 I am taking all the linience to block away all those who are with the wrong intentions because ITS MY ACCOUNT AND I HAVE EVERY RIGHT TO DO WHAT KEEPS ME AT PEACE😊 #NothingPersonalButAllThingspersonal ." Anasuya tweeted.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more