నాకు ఆ పని చేయడం రాదు, ఇంట్లో మనుషులను పెట్టుకున్నాం: నమ్రత
ప్రతి మెన్ సక్సెస్ వెనక ఒక ఉమెన్ ఉంటుంది అని చెబుతుంటారు. ఈ విషయాన్ని అక్షరాల నిజం చేశారు నమ్రత శిరోద్కర్. మహేష్ బాబు ఇటు నటుడిగా, అటు సినిమా, వ్యాపార రంగాల్లో అగ్రస్థాయికి ఎదగడంలో ఆమె కీలకపాత్ర పోషించారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మహేష్ బాబు కూడా పలు సందర్భాల్లో తన భార్య నమ్రత గురించి ప్రస్తావిస్తూ... ఆమె స్నేహితురాలు, నా ప్రపంచం అని చెప్పుకొచ్చారు. ఇలాంటి భార్య దొరికినందుకు నేను, ఇలాంటి స్ట్రాంగ్ మదర్ దొరికినందుకు నా పిల్లలు అదృష్టవంతులు అంటూ గతంలో ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే.

మదర్స్ డే సందర్భంగా నమ్రత...
మదర్స్ డే సందర్బంగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ.. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే, మహిళలందరూ స్ట్రాంగ్‌గా, ఫిట్‌గా ఉండాలి, అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలి అని చెప్పుకొచ్చారు.

నేను ఇలా ఉండటానికి కారణం నా జీవన విధానమే
నేను అప్పటికీ ఇప్పటికీ ఒకే రకమైన ఫిజిక్ మెయింటేన్ చేయడానికి కారణం నా జీవన విధానమే. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను. సరైన ఆహారం తీసుకుంటాను. ప్రతి రోజూ ఎక్సర్ సైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను అన్నారు.

వంట చేయడం రాదు
నా ఫుడ్ హాబిట్స్ అన్నీ చాలా డిసిప్లిన్‌గా ఉంటాయి. ఆంధ్రా ఫుడ్ అంటే ఇష్టం. అయితే నేను ఇంట్లో వంట చేయను. వంట చేయడం రాదు. హెల్దీ ఫుడ్ మాకు వండి పెట్టడానికి మంచి వంటవారు ఉన్నారు... అని నమ్రత తెలిపారు.

మా అమ్మ నుంచి నేర్చుకున్నవే సితారకు అప్లై చేస్తున్నాను
సితార పాపను సందర్బానుసారంగా ట్రెడిషనల్‌గా తయారు చేయడం నాకు అలవాటు. ఇది మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. మేము స్కూలుకు వెళ్లే రోజుల్లో రెండు జడలు వేసుకోవాలనే రూల్ ఉండేది. అందుకే సితారను కూడా అప్పుడప్పుడు రెండు జడలు వేసి తయారు చేస్తూ ఉంటాను అని నమ్రత చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











