For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రియుడు మానసికంగా వేధించాడు.. టార్చర్‌ భరించలేక.. ఇలియానా

  By Manoj
  |

  ఇలియానా.. ఈ పేరు తెలియని తెలుగు వాళ్లు ఉండరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో మెరిసి టాప్ హీరోయిన్‌గా ఎదిగిందీ ఈ గోవా బ్యూటీ. ఇక్కడ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లోని ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే, అదే సమయంలో దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వాలన్న భావనతో టాలీవుడ్‌కు బాయ్ చెప్పేసింది. హిందీలో ఆమె నటించిన 'బర్ఫీ' మినహా మిగిలిన సినిమాలేవీ అంతగా ఆడకపోవడంతో గోవా బ్యూటీ పని అయిపోయింది. ఇలియానా నటించిన చిత్రాలన్నీ వరసగా వైఫల్యాలు చెందడంతో అటు బాలీవుడ్‌లోను ఇటు టాలీవుడ్‌లోను అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. తాజాగా ఆమె కొన్ని రహస్యాలను బయట పెట్టింది. ఇంతకీ ఏంటవి..? వివరాల్లోకి వెళ్తే..

  అక్కడ ఆమె ఎప్పుడూ బిజీనే

  అక్కడ ఆమె ఎప్పుడూ బిజీనే

  ఇలియానా.. సినిమాల్లో కనిపించకపోయినప్పటికీ తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. అంటే ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌ అన్నమాట. తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన హాట్ ఫొటోలకు బీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. ఆమె ఫొటోలకు భారీ స్థాయిలో లైక్స్ కూడా వస్తుంటాయి. సినిమాల్లో నటించకున్నా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

  మరోసారి నిరాశ తప్పలేదు

  మరోసారి నిరాశ తప్పలేదు

  చాలా రోజుల తర్వాత తెలుగులో రవితేజ సరసన నటించింది ఈ అమ్మడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా ఇలియానా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించకపోవడంతో ఆమెకు నిరాశ తప్పలేదు. ఆ సినిమా తర్వాత ఇల్లీ బేబీ మళ్లీ కనిపించలేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఖతర్నాక్', ‘కిక్', ‘దేవుడు చేసిన మనుషులు' అనే సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

   విదేశీ లవర్‌తో రొమాన్స్

  విదేశీ లవర్‌తో రొమాన్స్

  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. దీంతో అప్పటి నుంచి ఆమె కెరీర్ గాడి తప్పింది. ఇద్దరూ కలిసి గోవాలో ఓ ఇంటిలో ఉండడం.. ఎక్కడకు వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని కనిపించడం వంటి వాటితో ఆమె తరచూ వార్తల్లో నిలిచేది. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది.

  దగ్గరుండి ఆ వీడియోలు తీశాడు

  దగ్గరుండి ఆ వీడియోలు తీశాడు

  ఆండ్రూతో ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో ఇలియానా దాదాపుగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది. వచ్చిన అవకాశాలు కూడా చాలా వరకు చేజారిపోయాయి. ఆ సమయంలో ఆండ్రూ.. ఇలియానాను సరికొత్తగా చూపించడం మొదలెట్టాడు. అప్పటి వరకు ఒకలా ఉన్న ఆమెను.. బోల్డ్ బ్యూటీగా మార్చేశాడు. అప్పట్లో ఇల్లీ బేబీ పోస్ట్ చేసిన హాట్ వీడియోలన్నీ ఆండ్రూ తీసినవేనన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

  మానసిక వేదనతో బ్రేకప్

  మానసిక వేదనతో బ్రేకప్

  ఇలియానా ప్రేమాయణానికి ఇటీవలే పుల్‌స్టాప్ పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అంతేకాదు, ఆండ్రూతో కలిసి దిగిన ఫొటోలను కూడా సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసేసింది. అయితే, బ్రేకప్‌నకు గల కారణాలు అప్పుడు ఇలియానా చెప్పలేదు. కానీ, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు రహస్యాలు వెల్లడించింది. ముఖ్యంగా మానసిక వేదనతోనే అతడికి బ్రేకప్ చెప్పానని వివరించింది.

  #CineBox: Tapsee Strong Counter To Reporter | Prabhas Fans Urges For #Prabhas20 Update
  అవి నెట్‌లో పెడతారని భయపడ్డా

  అవి నెట్‌లో పెడతారని భయపడ్డా

  ఒకానొక సందర్భంలో తన ఆరోగ్యం క్షిణించిందని చెప్పిన ఇలియానా.. దానికి గల కారణాలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘ఆండ్రూ నన్ను మానసికంగా వేధించేవాడు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఆ సమయంలో రోజుకు 12 టాబ్లెట్స్ వేసుకున్నా. దీంతో బరువు పెరిగిపోయా. అప్పడు బయటకు వెళ్లాలంటే నా ఫొటోలు నెట్‌లో పెడతారన్న భయంతో ఇంట్లోనే ఉండిపోయా. నాకు తెలిసిన యోగాతో మళ్లీ ఇలా తయారయ్యాను' అని ఆమె వెల్లడించింది.

  English summary
  Ileana D'Cruz is an Indian film actress who predominantly appears in Telugu and Hindi films. She has also starred in two Tamil films. D'Cruz won the Filmfare Award for Best Female Debut – South for the 2006 Telugu film Devadasu. She established herself in Telugu cinema with such commercially successful films as Pokiri (2006), Jalsa (2008), Kick (2009) and Julayi (2012).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X