అందాలను షేక్ చేస్తూ ఇలియానా.. వాట్ ఎ మూమెంట్! సెన్సేషనల్ వీడియో
టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు తన అందాల రుచి చూపించిన ఇలియానా.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయింది. ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

బాగా సన్నబడిన ఇలియానా
సాధారణంగా ఇలియానా అనగానే ఎవ్వరికైనా గుర్తొచ్చేది ఆమె సన్నని నడుమే. అయితే ఈ మధ్యకాలంలో కాస్త బరువు పెరిగిన ఆమె మళ్ళీ సన్నబడింది.

ఆ టాక్ తగ్గించుకోవాలని
ఇలియానా లావెక్కింది అనే టాక్ ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో రావడంతో సన్నబడటంపై శ్రద్ద పెట్టి.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది ఈ గోవా బ్యూటీ.

ఆ విషయం అందరికీ తెలియాలనే
సన్నబడే ప్రయత్నంలో సక్సెస్ అయిన ఇలియానా.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేస్తోంది. ఈ మేరకు పలు ఫోటోలు, వీడియోలతో అట్రాక్ట్ చేస్తోంది.
బెల్లీ డాన్స్.. నడుమందాలు
బెల్లీ డాన్స్ చేస్తూ నడుమందాలతో ఆకట్టుకోవడంలో ఇలియానాను మించిన హీరోయిన్ లేదనే చెప్పుకోవాలి. సో ఇదే అస్త్రాన్ని సంధిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది ఇల్లీ బేబీ.

మళ్లీ తన పాత ఫిజిక్
మళ్లీ తన పాత ఫిజిక్ సొంతం చేసుకున్న ఇలియానా.. బెల్లీ డాన్స్ చేసి అందాలను షేక్ చేసింది. సన్నని నడుమును గిరా గిరా తిప్పుతూ ఓ వీడియో క్లిప్ రిలీజ్ చేసింది.

వాట్ ఎ మూమెంట్!.. నెటిజన్ల కామెంట్స్
ఇలియానా పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్‌లో సన్నని నడుమును గిరా గిరా తిప్పుతున్న ఇల్లీ బేబీని చూసి వాట్ ఎ మూమెంట్! అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది.

దేవదాస్ అంటూ ఎంట్రీ
దేవదాస్ సినిమాతో టాలీవుడ్ తెరకు కొత్త అందాల రుచి చూపించి వావ్! అనిపించింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ తర్వాత వరుస ఆఫర్స్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇలియానా అందాలకు ఫిదా అయింది టాలీవుడ్ లోకం.

కొంతకాలం దూరంగా
ఆ వెంటనే రూటు మార్చేసి బాలీవుడ్ వైపు మొగ్గుచూపింది ఇలియానా. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించే అవకాశం రావడంతో అక్కడే సెటిలై తెలుగు సినిమాలకు కొంతకాలం దూరంగా ఉంది.

విదేశీ ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్
ఈ మధ్య కాలంలోనే విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్, ఆ తర్వాత బ్రేకప్ వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ మేరకు తిరిగి కెరీర్ పై దృష్టి సారించిన ఈ గోవా బ్యూటీ బాలీవుడ్ సహా దక్షిణాది లోనూ మరోసారి సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది.

నడుము అందాలతో మాయ
ఇటీవలే రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో తెలుగు తెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఒకప్పుడు ఎలాగైతే నడుము అందాలతో మాయ చేసిందో ఇప్పుడు కూడా అదే ఫార్ములా అప్లై చేయాలని ఇలియానా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











